RK’s Wife | ఆర్కే భార్య.. మావోల కోసం పని చేస్తుంది: ఎన్‌ఐఏ

RK's Wife విధాత: మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన దివంగత ఆర్కే(అక్కిరాజు హరగోపాల్‌) భార్య శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ మావోయిస్టుల రిక్రూట్ మెంట్ కోసం పనిచేస్తున్నారని, ఆర్కే డైరీ ఆధారంగానే శిరీషను అరెస్టు చేశామని ఎన్‌ఐఏ శనివారం ప్రకటించింది. వారిద్దరిని శుక్రవారం ఎన్‌ఐఏ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనిపై ఎన్‌ఐఏ అధికారులు స్పందిస్తూ దుడ్డు ప్రభాకర్, శిరీషలు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని, వారికి మావోయిస్టుల నుంచి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయని తెలిపారు. 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో […]

RK’s Wife | ఆర్కే భార్య.. మావోల కోసం పని చేస్తుంది: ఎన్‌ఐఏ

RK’s Wife

విధాత: మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన దివంగత ఆర్కే(అక్కిరాజు హరగోపాల్‌) భార్య శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ మావోయిస్టుల రిక్రూట్ మెంట్ కోసం పనిచేస్తున్నారని, ఆర్కే డైరీ ఆధారంగానే శిరీషను అరెస్టు చేశామని ఎన్‌ఐఏ శనివారం ప్రకటించింది.

వారిద్దరిని శుక్రవారం ఎన్‌ఐఏ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనిపై ఎన్‌ఐఏ అధికారులు స్పందిస్తూ దుడ్డు ప్రభాకర్, శిరీషలు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని, వారికి మావోయిస్టుల నుంచి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయని తెలిపారు.

2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాల్గొన్నారని, కొత్త రిక్రూట్‌మెంట్ల కోసం వారు పనిచేస్తున్నారని, అలాగే వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్లాన్ చేశారని ఎన్‌ఐఏ ఆరోపించింది.