వుషు ఈవెంట్‌లో భార‌త్‌కు తొలి సిల్వ‌ర్

వుషు ఈవెంట్‌లో భార‌త్‌కు తొలి సిల్వ‌ర్
  • 19వ ఆసియా క్రీడల్లో సాధించిన
  • మ‌ణిపూర్ అథ్లెట్ రోషిబినా దేవి


విధాత‌: ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు ప‌త‌కాల పంట పండుతున్న‌ది. హాంగ్‌జౌలోని జియోషాన్ గువాలీ స్పోర్ట్స్ సెంటర్‌లో గురువారం జరిగిన మహిళల 60 కేజీల వుషు ఈవెంట్‌లో రోషిబినా దేవి తొలి సిల్వ‌ర్‌ పతకాన్ని గెలుచుకుంది.


2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత రోషిబినా దేవి.. బుధవారం జరిగిన ఆసియా క్రీడల్లో వుషులో స్వర్ణ పతకానికి అర్హత సాధించిన రెండో భారతీయురాలుగా అవతరించింది. మ‌ణిపూర్‌కు చెందిన 22 ఏండ్ల‌ రోషిబినా దేవి వుషు అథ్లెట్‌. ఫైనల్‌ను 2-0తో ముగించడంతో చైనాకు చెందిన వు జియావోయ్ గట్టి ప్రత్యర్థిగా నిలిచారు.


రోషిబినా కంటే ముందు, వాంగ్‌ఖేమ్ సంధ్యారాణి దేవి 2010 ఎడిషన్‌లో గ్వాంగ్‌జౌలో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకానికి చేరుకున్న ఏకైక భారతీయ ఉషు క్రీడాకారిణి. ఫైనల్‌కు వచ్చిన రోషిబినా పాయింట్ల తేడాతో కజకిస్థాన్‌కు చెందిన ఐమన్ కర్షిగాపై సునాయాసంగా విజయం సాధించింది. 2019 దక్షిణాసియా క్రీడల్లో ఇదే విభాగంలో స్వర్ణ పతక విజేతగా నిలిచింది.