RRR 2: రాజ‌మౌళినా! మ‌జాకానా? ఎప్పటినుంచి అంటే!

విధాత: రాజమౌళి ఒక సినిమా పూర్తై.. విడుద‌లైన త‌ర్వాతే మరో సినిమాకి లైన్ క్లియర్ చేస్తాడు. ముందుగానే ఖ‌రారు అయినా కూడా చెప్ప‌డు. అలాంటిది ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ భారీ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం మొదలు కాకముందే ఆయన RRRకి సీక్వెల్‌గా RRR 2 ఉంటుందని ప్రకటించి సంచలనానికి తెర తీశాడు. ఇక RRRవిషయానికి వస్తే రాజమౌళి దర్శకునిగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం […]

  • By: krs    latest    Dec 27, 2022 5:57 AM IST
RRR 2: రాజ‌మౌళినా! మ‌జాకానా? ఎప్పటినుంచి అంటే!

విధాత: రాజమౌళి ఒక సినిమా పూర్తై.. విడుద‌లైన త‌ర్వాతే మరో సినిమాకి లైన్ క్లియర్ చేస్తాడు. ముందుగానే ఖ‌రారు అయినా కూడా చెప్ప‌డు. అలాంటిది ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ భారీ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం మొదలు కాకముందే ఆయన RRRకి సీక్వెల్‌గా RRR 2 ఉంటుందని ప్రకటించి సంచలనానికి తెర తీశాడు.

ఇక RRRవిషయానికి వస్తే రాజమౌళి దర్శకునిగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఏ రేంజిలో సంచ‌ల‌నం సృష్టించి, ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందో మాటల్లో చెప్పలేం. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓటిటి విడుద‌ల తరువాత విదేశీయులను విపరీతంగా ఆకట్టుకుంది. విదేశీయులు ఎగ‌బ‌డి మరి ఈ సినిమాను చూశారు.

నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ సినిమాలు మినహా పెద్దగా ప్రాంతీయ చిత్రాలను చూడరు. కానీ హాలీవుడ్ సినిమాల‌ తర్వాత 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ని రప్పించుకున్న ఏకైక ఇండియన్ చిత్రంగా RRR సంచలనం సృష్టించింది. ఇది ఒక కొత్త చరిత్ర అని చెప్పాలి.

వాస్తవానికి RRR చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎవ్వ‌రూ పాన్ వ‌ర‌ల్డ్ రేంజిలో గుర్తింపు వస్తుంద‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అందులోనూ ఈ సినిమాకి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ కూడా క్యూ కట్టేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి, సంగీత దర్శకుడిగా కీరవాణి, ఉత్తమ కథానాయకుడిగా రామ్ చరణ్, ఉత్తమ సహాయ నటుడిగా ఎన్టీఆర్‌లకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.

తాజాగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్‌కు షార్ట్ లిస్ట్ అవడం మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ విషయం. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన రాజ‌మౌళికి ఉంది. దాని మీద వర్క్ చేస్తున్నాం అంటూ రాజమౌళి గతంలోనే పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఒక అద్భుతమైన లైన్ దొరికిందని, కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, బాహుబలి పార్ట్2 రేంజిలో క్లిక్ అవుతున్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

తన ప్రతి సినిమాకి ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించే రాజమౌళి ఈసారి కూడా ఈ మూవీ ప్లానింగ్‌ను మొద‌లుపెట్టి.. ఎప్పటినుంMR మొదలు పెట్టాలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఉంచాడట. ప్ర‌స్తుతం ఆయ‌న సూపర్ స్టార్ మహేష్ బాబు‌తో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా కోసం రాజమౌళి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకోడ‌ట. గత చిత్రాలకు భిన్నంగా అతి తక్కువ సమయంలో ఈ చిత్రాన్ని పూర్తిచేసి 2025 సమ్మర్ కానుకగా విడుదల చేస్తాడని, అదే ఏడాదిలోనే ఆర్‌ఆర్‌ఆర్ పార్ట్ 2 మొదలుపెట్టే ఆలోచనలో రాజ‌మౌళి ఉన్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.