RRR Actor Ray Stevenson | ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు రే స్టీవెన్స్‌ కన్నుమూత.. నివాళులర్పించిన టీమ్‌..!

RRR Actor Ray Stevenson | టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్‌ (58) కన్నుమూశారు. ఐరిష్‌ నటుడు ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధులు తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రే స్టీవెన్సన్‌ గవర్నర్‌ స్కాట్‌ బక్స్‌టన్‌ పాత్రలో నటించి.. మెప్పించారు. 1964 మే 25న జన్మించిన స్టీవెన్సన్‌ హాలీవుడ్‌లో ‘థోర్‌’ సిరీస్‌లతో నటించి మెప్పించారు. ఆయన మృతి వార్త తెలుసుకొని అభిమానులు […]

  • By: Vineela |    latest |    Published on : May 23, 2023 3:43 AM IST
RRR Actor Ray Stevenson | ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు రే స్టీవెన్స్‌ కన్నుమూత.. నివాళులర్పించిన టీమ్‌..!

RRR Actor Ray Stevenson |

టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్‌ (58) కన్నుమూశారు. ఐరిష్‌ నటుడు ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధులు తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రే స్టీవెన్సన్‌ గవర్నర్‌ స్కాట్‌ బక్స్‌టన్‌ పాత్రలో నటించి.. మెప్పించారు. 1964 మే 25న జన్మించిన స్టీవెన్సన్‌ హాలీవుడ్‌లో ‘థోర్‌’ సిరీస్‌లతో నటించి మెప్పించారు. ఆయన మృతి వార్త తెలుసుకొని అభిమానులు షాక్‌కు గురయ్యారు.

స్టీవెన్సన్‌ మృతికి ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్‌కు గురిచేసింది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది.