Rahul Sipligunj | ఎట్టకేలకి ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన రాహుల్ సిప్లిగంజ్..వధూవరులని ఆశీర్వదించిన కవిత
Rahul Sipligunj | ప్రముఖ గాయకుడు, ‘బిగ్ బాస్ 3’ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో ఆయన గురువారం తెల్లవారుజామున మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేశారు.
Rahul Sipligunj | ప్రముఖ గాయకుడు, ‘బిగ్ బాస్ 3’ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో ఆయన గురువారం తెల్లవారుజామున మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆగస్టులో అతి కొద్ది మందిని మాత్రమే పిలిచి సడన్ ఎంగేజ్మెంట్ జరుపుకున్న రాహుల్, గత కొన్ని వారాలుగా పెళ్లి ఏర్పాట్లతో పూర్తిగా బిజీగా ఉన్నారు. రాహుల్–హరిణ్య జంటను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా ఆశీర్వదించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.తెలంగాణ ఫోక్ సాంగ్స్ నుండి మాస్ బీట్‌ల వరకు తనదైన స్టైల్‌తో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్, ‘RRR’లోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ కు వాయిస్ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘గద్దర్ అవార్డుల’లో ఆయన ప్రతిభను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసిస్తూ సత్కరించడం ఇంకా అందరి దృష్టిని ఆకర్షించింది.
రాహుల్ పాడిన ‘కాలేజ్ బుల్లోడా’, ‘రంగా రంగా రంగస్థలానా’, ‘బొమ్మోలే ఉన్నదిరా పోరీ’, ‘వాస్తు బాగుందే’, ‘ఓ నా రాహులా’ వంటి పాటలు భారీ హిట్లు అయ్యాయి. ఇక పండుగల స్పెషల్ సాంగ్స్‌లో కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రంగమార్తాండ’ సినిమాలో నటుడిగా కూడా మెప్పించిన రాహుల్, త్వరలోనే హీరోగా కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇక కొత్త జీవితం మొదలుపెట్టిన రాహుల్–హరిణ్య జంటకు సినీ, సంగీత రంగం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram