Rupee | రికార్డు స్థాయిలో రూపాయి పతనం
Rupee | 20 పైసలు తగ్గి డాలరుకు 83.15 పైసలు ముంబై: రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. గురువారం 20 పైసలు తగ్గి.. రూ.83.15 వద్ద నిలిచింది. బలమైన ఓవర్సీస్ గ్రీన్‌బ్యాక్, దేశీయ ఈక్వాలిటీల బలహీనతతో రూపాయి పతమైంది. మంగళవారం, బుధవారం సెలవులతో ఫారెక్స్ మార్కెట్ గురువారం ప్రారంభమైంది. అయితే.. సోమవారంతో పోల్చితే.. 0.24శాతం పడిపోయింది. సోమవారం రూపాయి విలువ పది పైసలు పడిపోయి.. రూ.82.95గా ఉన్నది. 2022 అక్టోబర్ 20న రూపాయి విలువ రికార్డు స్థాయిలో […]
Rupee |
20 పైసలు తగ్గి డాలరుకు 83.15 పైసలు
ముంబై: రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. గురువారం 20 పైసలు తగ్గి.. రూ.83.15 వద్ద నిలిచింది. బలమైన ఓవర్సీస్ గ్రీన్‌బ్యాక్, దేశీయ ఈక్వాలిటీల బలహీనతతో రూపాయి పతమైంది. మంగళవారం, బుధవారం సెలవులతో ఫారెక్స్ మార్కెట్ గురువారం ప్రారంభమైంది.
అయితే.. సోమవారంతో పోల్చితే.. 0.24శాతం పడిపోయింది. సోమవారం రూపాయి విలువ పది పైసలు పడిపోయి.. రూ.82.95గా ఉన్నది. 2022 అక్టోబర్ 20న రూపాయి విలువ రికార్డు స్థాయిలో 83.29 పైసలకు పడిపోయింది. ఇప్పుడు ఆ రికార్డు సైతం చెదిరిపోయింది.
మరోవైపు ముడి చమురు ధరలు గరిష్ఠస్థాయిలో ట్రేడ్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.84% పెరిగి.. 84.15 డాలర్లుగా ఉన్నది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.82శాతం పెరిగి.. 80.03 డాలర్లుగా ఉన్నది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram