Russia oil | రష్యా చమురు సొమ్ము.. ఎవరి జేబులోకి?
వరదలా పోటెత్తుతున్న దిగుమతులు రిలయన్స్, నయారాకే లాభం? విధాత: రష్యా నుంచి చమురు (Russia oil ) దిగుమతులు వరదలా పోటెత్తుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ చవక చమురు ఎవరి జేబులు నింపుతోoదన్న చర్చ మొదలైంది. అంతర్జాతీయ సమాజాన్ని ఎదిరించి సైతం మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ఆ దేశం చేస్తున్న మొత్తం ఎగుమతుల్లో ఒక శాతం మాత్రమే భారత్‌కు దిగుమతి అవుతోందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెబుతున్నప్పటికీ.. ఈ సంవత్సరాంతానికి ఆ మొత్తం […]

- వరదలా పోటెత్తుతున్న దిగుమతులు
- రిలయన్స్, నయారాకే లాభం?
విధాత: రష్యా నుంచి చమురు (Russia oil ) దిగుమతులు వరదలా పోటెత్తుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ చవక చమురు ఎవరి జేబులు నింపుతోoదన్న చర్చ మొదలైంది. అంతర్జాతీయ సమాజాన్ని ఎదిరించి సైతం మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ఆ దేశం చేస్తున్న మొత్తం ఎగుమతుల్లో ఒక శాతం మాత్రమే భారత్‌కు దిగుమతి అవుతోందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెబుతున్నప్పటికీ.. ఈ సంవత్సరాంతానికి ఆ మొత్తం 30 శాతం ఉండొచ్చని నిపుణుల అంచనా.
ఆ రెండు కంపెనీలకే లబ్ధి..
అయితే ఈ చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులను విదేశాలకు అమ్మడం ద్వారా రెండు బడా ప్రైవేటు కంపెనీలు లాభపడుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అవే రిలయన్స్, నయారా. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీలు ఇలాంటి వ్యాపారం చేయకూడదు.
అయితే ప్రైవేటు రిఫైనరీలకు ఇలాంటి రూల్స్ వర్తించవు. దీంతో వీరు ఆడింది ఆట పాడింది పాటగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే రష్యా చమురును ఇక్కడ దిగుమతి చేసుకుని యూరప్ దేశాలకు పెట్రోల్ ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా పై రెండు సంస్థలు కళ్లు చెదిరే లాభాలు ఆర్జించాయి.
అయితే విదేశాలు బ్యారెల్ చమురును సగటున 100 డాలర్లకు కొంటుండగా.. మనకు 70 డాలర్లకే వస్తోంది. అంత తక్కువ రేటుకే చమురు లభిస్తున్నపుడు ఆ లాభాలను ప్రజలకు బదిలీ చేయకుండా పెట్రోల్ రేటును ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదని ఒక ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు. మోదీ కొంత మంది పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా విదేశాంగ విధానాన్ని రూపొందిస్తున్నారని రాజకీయ విమర్శకులు ఆరోపిస్తున్నారు.
రిలయన్స్ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంస్థల పెట్రోల్ బంకుల కంటే రూపాయి తక్కువకే డీజిల్‌ను విక్రయిస్తోంది. సోమవారం నుంచి ఈ రేటు అమల్లోకి వచ్చినట్లు రాయిటర్స్ పేర్కొంది.