Viral Video | గుడిలో దేవుడికి మొక్కుతుండ‌గా గుండెపోటు.. వ్యక్తి మృతి

Viral Video | ఆ భ‌క్తుడి మ‌ర‌ణాన్ని దేవుడు కూడా ఆప‌లేక‌పోయాడు. దేవుడికి మొక్కుతుండ‌గానే ఆ భ‌క్తుడు గుండెపోటుకు గుర‌య్యాడు. ఆ దేవుడి పాదాల ముందు కుప్ప‌కూలాడు. ఈ విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కంతిలో చోటు చేసుకుంది. కంతికి చెందిన రాజేశ్ మేహ‌నీ అనే భ‌క్తుడు.. గురువారం రోజు షిర్డీ సాయి టెంపుల్‌కు వెళ్లాడు. భ‌క్తులంద‌రూ సాయిబాబా విగ్ర‌హానికి అంద‌రూ మొక్కుతున్నారు. ఇక రాజేశ్ కూడా సాయి విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లి.. పూజ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాడు. దేవుడికి […]

Viral Video | గుడిలో దేవుడికి మొక్కుతుండ‌గా గుండెపోటు.. వ్యక్తి మృతి

Viral Video | ఆ భ‌క్తుడి మ‌ర‌ణాన్ని దేవుడు కూడా ఆప‌లేక‌పోయాడు. దేవుడికి మొక్కుతుండ‌గానే ఆ భ‌క్తుడు గుండెపోటుకు గుర‌య్యాడు. ఆ దేవుడి పాదాల ముందు కుప్ప‌కూలాడు. ఈ విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కంతిలో చోటు చేసుకుంది.

కంతికి చెందిన రాజేశ్ మేహ‌నీ అనే భ‌క్తుడు.. గురువారం రోజు షిర్డీ సాయి టెంపుల్‌కు వెళ్లాడు. భ‌క్తులంద‌రూ సాయిబాబా విగ్ర‌హానికి అంద‌రూ మొక్కుతున్నారు. ఇక రాజేశ్ కూడా సాయి విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లి.. పూజ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాడు. దేవుడికి మొక్కుతుండ‌గానే గుండెపోటుకు గురై సాయి పాదాల వ‌ద్ద ఒరిగిపోయాడు రాజేశ్‌.

మిగ‌తా భ‌క్తులంద‌రూ.. అత‌ను భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి తేలుతున్నాడ‌ని భావించారు. 15 నిమిషాల పాటు ఆ భ‌క్తుడు సాయి పాదాల వ‌ద్ద‌నే ఒరిగిపోయాడు. అత‌ను దేవుడి పాదాల వ‌ద్ద నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డంతో.. అప్ర‌మ‌త్త‌మైన ఆల‌య సిబ్బంది.. హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రాజేశ్ గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

రాజేశ్ మెహ‌నీ అనే వ్య‌క్తి స్థానికంగా మెడిక‌ల్ షాపు నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్ర‌తి గురువారం సాయి ఆల‌యానికి వ‌చ్చి పూజ‌లు చేసి వెళ్తుంటాడ‌ని ఆల‌య సిబ్బంది తెలిపారు. రాజేశ్ మృతితో అత‌ని కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.