Palash Muchhal | బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. స్మృతి తండ్రితో పాటు కాబోయే భ‌ర్త ఆసుప‌త్రిలో..!

Palash Muchhal | భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన , ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం ఆదివారం జ‌ర‌గాల్సి ఉండ‌గా అకస్మాత్తుగా వాయిదా పడింది. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకి గుండెపోటు రావ‌డంతో ఆసుపత్రిలో చేరారు.

  • By: sn |    movies |    Published on : Nov 24, 2025 11:03 AM IST
Palash Muchhal | బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. స్మృతి తండ్రితో పాటు కాబోయే భ‌ర్త ఆసుప‌త్రిలో..!

Palash Muchhal | భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన , ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం ఆదివారం జ‌ర‌గాల్సి ఉండ‌గా అకస్మాత్తుగా వాయిదా పడింది. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకి గుండెపోటు రావ‌డంతో ఆసుపత్రిలో చేరారు. ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. స్మృతికి తన తండ్రితో ఉన్న అనుబంధం ఎంతో గాఢమైనది. తన క్రికెట్ కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి తండ్రి చేసిన త్యాగాలు అమూల్యమైనవని స్మృతి ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. అందుకే తండ్రి పూర్తిగా కోలుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఆమె నిర్ణయించింది.

పలాష్ ముచ్చల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక

ఇక ఇదే సమయంలో స్మృతి కాబోయే వరుడు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ సమస్యల కారణంగా ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే పలాష్ ఆరోగ్యం మేట‌ర్ పెద్ద సమస్యేమీ కాదని, చికిత్స తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.

2019లో ప్రారంభమైన ప్రేమకథ

స్మృతి–పలాష్ ప్రేమకథ 2019లోనే మొదలైనట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఈ జంట మహారాష్ట్రలోని సాంగ్లీలో వివాహ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. అయితే తండ్రి ఆరోగ్య కారణంగా వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది.

స్మృతి & పలాష్ ఆస్తులు

బీసీసీఐ గ్రేడ్–A కాంట్రాక్ట్ కలిగిన స్మృతి మంధాన వార్షిక ఆదాయం సుమారు ₹50 లక్షలు. ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు ₹15 లక్షలు, వన్డేకు ₹6 లక్షల వరకు పొందుతోంది. ఆమె నికర ఆస్తి విలువ సుమారు ₹34 కోట్లుగా అంచనా. ఇక ప‌లాష్ ముచ్చ‌ల్ విష‌యానికి వ‌స్తే.. 1995లో ఇండోర్‌లో జన్మించిన పలాష్ ముచ్చల్, ముసాఫిర్, తూ హీ హై ఆషికీ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. టీవీ కార్యక్రమాలకు కూడా సంగీతం సమకూర్చారు. ఆయన ఆస్తి ₹20 నుండి ₹41 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.