Naga Chaitanya | సినిమా వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్ళు అనగానే మూడునాళ్ళ ముచ్చటని తేల్చేసేట్టు మారిపోయింది కాలం. ఒకప్పటికీ ఇప్పటి కాలానికీ చాలా మార్పులే వచ్చాయి. ఇద్దరు కలిపి జీవించాలనుకున్నది ఎంత వేగంగా జరుగుతుందో, విడిపోవాలన్నా అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక విడాకుల పర్వం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగానే జరుగుతుంది. విడాకుల విషయంలో తెలుగు తెరకు సంబంధించి పెద్ద షాక్ ఇచ్చిన జంట నాగ చైతన్య, సమంత. ఈ ఇద్దరూ ‘ఏ మాయ […]
Naga Chaitanya |
సినిమా వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్ళు అనగానే మూడునాళ్ళ ముచ్చటని తేల్చేసేట్టు మారిపోయింది కాలం. ఒకప్పటికీ ఇప్పటి కాలానికీ చాలా మార్పులే వచ్చాయి. ఇద్దరు కలిపి జీవించాలనుకున్నది ఎంత వేగంగా జరుగుతుందో, విడిపోవాలన్నా అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక విడాకుల పర్వం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగానే జరుగుతుంది. విడాకుల విషయంలో తెలుగు తెరకు సంబంధించి పెద్ద షాక్ ఇచ్చిన జంట నాగ చైతన్య, సమంత.
ఈ ఇద్దరూ ‘ఏ మాయ చేసావె’ సినిమాతో ఒకటయ్యారు. ప్రేమ, పెళ్లి, రెండేళ్ళ కాపురం, వెరసి విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోయాయి. ఎవరికి వారు మేం ఇష్టంతోనే, ఒకరిపై ఒకరం గౌరవంతోనే.. స్నేహితుల్లా విడిపోతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ విడిపోయారు.
ఈ జంట విడిపోయారంటే చాలామంది నమ్మలేదు. ఏమైందో ఏమో ఆ లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.. కానీ ఆతర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటం, సినిమాల్లో గ్లామర్ పెంచేయడం ఇలా చాలా పరిణామాల మధ్య నాగచైతన్య ఎలాంటి కామెంట్లకూ రిఫ్లయ్ ఇవ్వలేదు. రియాక్ట్ కాలేదు.
తాజాగా సమంత, విజయ్ దేవర కొండ జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా.. రొమాంటిక్ ఎంటర్టైనర్గా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ ప్రమోషన్లో భాగంగా జరిగిన ఈవెంట్లో సమంత, విజయ్ చేసిన హాట్ పెర్ఫామెన్స్.. షో చూస్తున్నవారిని, ప్రేక్షకుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. డాన్స్ చేస్తూ విజయ్ తన షర్ట్ తీసేసి సమంతను గాల్లోకి ఎత్తి పట్టుకోవడం ఇలాంటి పెర్ఫామెన్స్ చూసి అవాక్కయ్యారు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.
ఇక ఇదే అదునుగా అక్కినేని ఫ్యాన్స్ సమంత మీద యుద్ధానికి దిగారు. దీనికి నాగ చైతన్య కూడా ఫైర్ అయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భార్య అయినా, మాజీ భార్య అయినా సరే.. వేరొకరితో క్లోజ్‌గా ఉందంటే సహించలేరు. కానీ నాగ చైతన్య కాస్త గుంభనమైన వ్యక్తి.
అంత త్వరగా ఏ విషయంలోనూ బైటపడడు. ఒక రకంగా చైతూని రెచ్చగొట్టడానికే సమంత ఇలా చేసిందనే వారూ లేక పోలేదు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కొందరు దీనికి త్వరలోనే నాగ చైతన్య సమాధానం ఇవ్వబోతున్నాడం టూ కామెంట్స్ మొదలెట్టారు.
అదెలా అంటే.. నాగ చైతన్య నెక్ట్స్ సినిమాలో శోభిత ధూళిపాళ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. శోభిత, నాగచైతన్య మధ్య ఏదో ఉందనే వార్తలూ జోరుగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పుడు సమంత చేసిన దానికి.. రెట్టింపు రొమాన్స్ సీన్స్‌ని సినిమాలో దట్టించబోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్. ఇది నిజమైతే మాత్రం.. అక్కినేని ఫ్యాన్స్ మరోసారి సమంతని టార్గెట్ చేయడం ఖాయం.
ఏది ఏమైనా సమంత విషయంలో నాగచైతన్య కాస్త గట్టిగానే తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని అక్కినేని ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎవరి కెరియర్‌తో వాళ్ళు బిజీగా సాగిపోతే పరవాలేదు.. విడిపోయాక పర్సనల్ పేచీలు కూడా ఎందుకు అనేవాళ్ళూ లేకపోలేదు. చూడాలి ఈ ఇద్దరి కథలు ఎటు చేరనున్నాయో మరి.