Samyuktha Menon | పాపం సంయుక్తా.. వరుసగా నాలుగు హిట్లు వచ్చినా ఏం లాభం?
Samyuktha Menon విధాత: సంయుక్తా మీనన్(Samyuktha Menon).. ఇప్పుడీ భామపై ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్, ప్లాటినమ్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే.. అమ్మడు పట్టుకుందల్లా బంగారం.. అదే చేస్తున్న సినిమాలన్నీ హిట్టులవుతున్నాయి. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, రీసెంట్‌గా వచ్చిన ‘విరూపాక్ష’.. ఇలా అన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలుస్తుండటంతో.. ఇండస్ట్రీలో సంయుక్త పేరు మారుమోగుతోంది. అయితే పేరు అయితే మోగుతుంది కానీ.. అవకాశాలు మాత్రం ఈ భామకి అనుకున్న స్థాయిలో రావడం లేదనేది ఇండస్ట్రీ వర్గాల్లో […]
Samyuktha Menon
విధాత: సంయుక్తా మీనన్(Samyuktha Menon).. ఇప్పుడీ భామపై ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్, ప్లాటినమ్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే.. అమ్మడు పట్టుకుందల్లా బంగారం.. అదే చేస్తున్న సినిమాలన్నీ హిట్టులవుతున్నాయి. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, రీసెంట్‌గా వచ్చిన ‘విరూపాక్ష’.. ఇలా అన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలుస్తుండటంతో.. ఇండస్ట్రీలో సంయుక్త పేరు మారుమోగుతోంది.
అయితే పేరు అయితే మోగుతుంది కానీ.. అవకాశాలు మాత్రం ఈ భామకి అనుకున్న స్థాయిలో రావడం లేదనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. నిజమే.. మొదటి సినిమా హిట్ కాకపోయినా శ్రీలీల వంటి హీరోయిన్‌కు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఆమెకు ‘ధమాకా’ తప్పితే హిట్ లేదు.
కానీ సంయుక్త(Samyuktha Menon) పరిస్థితి అలా కాదు.. వరుస హిట్స్ ఉన్నాయి.. కానీ చేతిలో అవకాశాలు మాత్రం లేవు. ప్రస్తుతం సంయుక్తా ఒకే ఒక్క సినిమాలో చేస్తుందీ అంటే.. ఆమెకు సక్సెస్ ఏ కోశానా ఉపయోగపడలేదనేది ఇట్టే అర్థమవుతుంది. శ్రీలీల మాత్రం ఇప్పుడు పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బాలయ్య ఇలా అగ్ర హీరోల చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ టాప్ ఛైర్ కోసం పోటీ పడుతోంది.
#samyukthamenon BTS during for #Virupakasha launch pic.twitter.com/DvcCms30Jm
— Star Frames (@starframesoffl) April 26, 2023
అయితే శ్రీలీలతో పోల్చితే గ్లామర్ పరంగా సంయుక్తా మీనన్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. సంయుక్తా ఫిగర్ అలాంటిది మరి. కానీ.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. అయితే అందుకు కారణం లేక పోలేదు. ఆమె యాటిట్యూడ్ కారణంగానే.. ఇప్పుడామెకు అవకాశాలు రావడం లేదనేలా ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చెక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. సంయుక్తా మీనన్ సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుతూ.. అడిగినంతా ఇస్తేనే చేస్తానని అంటోందట. అలాగే సినిమా ఓకే చేశాక.. ఆమె నిర్మాతలను, చిత్ర యూనిట్‌ను ముప్పతిప్పులు పెడుతోందని కూడా టాక్ నడుస్తోంది. షూటింగ్‌కు ఆలస్యంగా రావడంతో పాటు.. రెమ్యూనరేషన్ కాకుండా నిర్మాతలను గొంతెమ్మ కోర్కెలు కోరుతుందట.
అందుకే.. దర్శకులు సంయుక్తా మీనన్ పేరు చెప్పినా.. నిర్మాతలు మాత్రం అయ్యబాబోయ్ వద్దు.. మరో హీరోయిన్ పేరు చెప్పమని అంటున్నారట. అది విషయం. మొత్తంగా సక్సెస్‌ని తలకెక్కించుకుని ఈ అమ్మడు అవకాశాలు లేకుండా చేసుకుంటుందనేలా ఆమెపై వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలపై సంయుక్తా మీనన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
X




Google News
Facebook
Instagram
Youtube
Telegram