Shobana | శోభన.. ఏం మనసమ్మా నీది.. ఇలాంటి మనసు నిండునూరేళ్లు బతకాలి..
Shobana విధాత: తప్పును వేలెత్తి చూపడం కంటే క్షమించడం గొప్ప మనసున్నవారికే సాధ్యం. అలాంటి గొప్ప మనసు ఎవరికో కానీ ఉండదు. నటి శోభన తన మనసు ఎంత గొప్పదో ఈ పనితో చాటుకుంది. తన ఇంట్లో జరిగిన దొంగతనం పనిమనిషే చేసినా, అది తెలిసి కూడా ఆమెను క్షమించిందట.. ఇప్పుడు ఈవార్త వైరల్ అవుతుంది. ఆమెకు సినిమాలలో అందంగా నటించడమే తెలుసు.. అంతకుమించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శోభన అందగత్తే కాదు మంచి మనసున్న […]
Shobana
విధాత: తప్పును వేలెత్తి చూపడం కంటే క్షమించడం గొప్ప మనసున్నవారికే సాధ్యం. అలాంటి గొప్ప మనసు ఎవరికో కానీ ఉండదు. నటి శోభన తన మనసు ఎంత గొప్పదో ఈ పనితో చాటుకుంది. తన ఇంట్లో జరిగిన దొంగతనం పనిమనిషే చేసినా, అది తెలిసి కూడా ఆమెను క్షమించిందట.. ఇప్పుడు ఈవార్త వైరల్ అవుతుంది. ఆమెకు సినిమాలలో అందంగా నటించడమే తెలుసు.. అంతకుమించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శోభన అందగత్తే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా అని నిరూపణ అయింది ఈ సంఘటనతో.. విషయంలోకి వెళితే..

నటి శోభన తెలుగు, తమిళ్, కన్నడ ఇలా పలు భాషల్లో చక్కని నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోలందరి సరసనా నటించింది. చక్కని అందం, అణకువ కలిగిన వ్యక్తి. రూపురేఖలకు తగినట్టే భరత నాట్యంలో అందేవేసిన చేయి. పెళ్ళి చేసుకోకపోయినా, నాట్యాన్ని తన సర్వస్వంగా భావించి, కళకే అంకితమైంది శోభన. ఆమె సున్నితమైన అడుగులు కదులుతుంటే చూస్తున్న జనాలు మంత్రముగ్దులైపోవాల్సిందే. అలాంటి నటి మనసు కూడా ఇంకా సున్నితమని ఈ సంఘటన చెబుతుంది.

ఇటీవల శోభన ఇంట్లో కొంత నగదు కనిపించకుండా పోయిందట. డబ్బు కనిపించడం లేదని కంగారు పడి, పోలీసులకు కబురందించింది. అయితే పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో శోభన ఇంట్లో పనిచేసే పనిమనిషి 42వేల రూపాయలను తనే తీసి డ్రైవర్ ద్వారా కూతురికి పంపించాననే విషయాన్ని చెప్పేసింది. దీనికి శోభన ఆమె మీద కోపగించుకోకుండా ఎటువంటి రిపోర్ట్ చేయకుండా కేసు వాపసు తీసుకుంది. అంతేనా ఇకపై అలాంటి పని చేయవద్దని ఆమెను పంపించకుండా తన దగ్గరే పనిలో ఉంచింది. నెల నెలా ఇంత చొప్పున డబ్బు రికవరీ చేయమని, ఇకపై అవసరం వస్తే నన్నే అడగమని చెప్పిందట శోభన.

అది విషయం.
అవసరం ఎంతపనైనా చేయిస్తుంది. నిజాయితీని బ్రతకనీయదు. ఈరోజు పనిమనిషి తప్పు చేసిందని పనిలోంచి తీసేస్తే ఆమె మరోచోట అదే పని చేస్తుంది. అదే ఊదారంగా వదిలేస్తే ఇక ఎప్పుడు కష్టం వచ్చినా యజమానికి చెప్పుకుంటుందనే ధోరణిలో శోభన ఇదంతా చేసిందని అనుకుంటున్నారు. ఇలాంటిది వేరే ఎవరైనా ఇంటిలో జరిగి ఉంటే.. ఈ పాటికి ఆ పనిమనిషి జీవితం జైల్లో.. ఆమె ఇల్లు రోడ్డున పడి ఉండేది. కానీ శోభన చేసిన పని నచ్చి.. ఏం మనసమ్మా నీది.. ఇలాంటి మనసు నిండునూరేళ్లు బతకాలి.. చాలా మంచి పని చేశావ్ అంటూ ఇప్పుడామెను పొగుడుతున్నారు జనాలు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram