BRSకు షాక్: సొంతగూటికి చేరిన మాజీ MP డి.శ్రీనివాస్

విధాత: బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం గాంధీభవన్ కి వెళ్లిన డిఎస్ టి.పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన డి.శ్రీనివాస్ తిరిగి తన సొంత పార్టీకి రావడం సొంత ఇంటికి వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందంగా […]

  • Publish Date - March 26, 2023 / 08:45 AM IST

విధాత: బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం గాంధీభవన్ కి వెళ్లిన డిఎస్ టి.పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

గతంలో పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన డి.శ్రీనివాస్ తిరిగి తన సొంత పార్టీకి రావడం సొంత ఇంటికి వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడు మాజీ మేయర్ సంజయ్ తో కలిసి ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

పార్టీలో చేరిన అనంతరం ఆయన రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటానని తెలిపారు. డి. శ్రీనివాస్ మరో కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ బిజెపిలో కీలక నేతగా ఉన్నారు.

Latest News