షూటింగ్‌లో శ్రద్ధా దాస్‌పై దారుణంగా దాడి చేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌..!

శ్రద్ధా దాస్‌. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

షూటింగ్‌లో శ్రద్ధా దాస్‌పై దారుణంగా దాడి చేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌..!

Shraddha Das | శ్రద్ధా దాస్‌. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘ముగ్గురు’, ‘మొగుడు’ ‘ఆర్య2′, ‘డార్లింగ్’ తదితర చిత్రాల్లోనూ మెరిసింది. అయితే, హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా.. బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్లతోనే మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెరపై జడ్జిగానూ అలరిస్తున్నది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్‌ తనను దారుణంగా కొట్టిందని, దాంతో హాస్పిటల్‌లో చేరాల్చిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది.


ఈ ఘటన గతంలో జరిగిన ఘటనను శ్రద్ధాదాస్‌ గుర్తు చేసుకుంది. శ్రద్ధా దాస్‌ను కొట్టింది ఎవరో కాదు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కజిన్‌ అయిన మన్నారా చోప్రా. ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ మూవీతో మన్నారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ కనిపించింది. మన్నారా ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌-17 మన్నారా చోప్రా పాల్గొన్నది. ఇవాళ ఫినాలే జరుగున్నది. ఈ క్రమంలో మన్నారా, శ్రద్ధా దాస్‌ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ‘జిద్‌’ సినిమాలో శ్రద్ధా దాస్‌, మన్నారా చోప్రా ఇద్దరూ కలిసి నటించారు. షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మూవీలోని ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మన్నారా.. శ్రద్ధాను తోసే సన్నివేశం ఉండగా.. మెల్లగా నెట్టమని చెప్పినా వినకుండా గట్టిగా నట్టేసిందని అప్పట్లో శ్రద్ధా దాస్‌ పేర్కొంది.


దాంతో మెట్లు తగిలి శ్రద్ధా దాస్‌కు గాయాలయ్యాయని, ఆ తర్వాత మరో సీన్‌లో చాతిపై పంచ్‌ ఇవ్వాలంటే మన్నారా గట్టిగా గుద్దిందని.. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా వినిపించుకోకుండా కొడుతూ ఉందని.. దాంతో తనకు దాదాపు 30 గాయాలయ్యాయని అప్పట్లో శ్రద్ధా దాస్‌ చెప్పుకొచ్చింది. ఓ ఫైట్ సీన్‌లో డమ్మీ స్టిక్‌తో కొట్టాల్సి ఉంటే.. రియల్ స్టిక్‌తో కొట్టడంతో కంటికి గాయమైనట్లు చెప్పింది. దాంతో హాస్పటల్‌లో చేరాల్సి వచ్చిందని వివరించింది శ్రద్ధా దాస్‌. మన్నారా బిగ్‌బాస్‌ ఫినాలేకు చేరడంతో తాజాగా విషయం మాట్లాడటానికి శ్రద్ధా దాస్‌ నిరాకరించగా.. ఇద్దరి గొడవ మరోసారి వెలుగులోకి వచ్చింది.