Shruti Haasan | శృతిహాసన్‌కి కూడా అరుదైన వ్యాధి.. దీనికి ఆమె ఏం చేస్తుందంటే?

Shruti Haasan | హీరోయిన్స్‌కు అరుదైన వ్యాధి ఉందని, ఆరోగ్యపరమైన సమస్యలున్నాయనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట కాదు. గౌతమి, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, మనీషా కొయిరాలా వంటి స్టార్ హీరోయిన్స్ ప్రాణాంతకరమైన క్యాన్సర్‌తో పోరాడి జయించారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇక కొంత కాలంగా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి […]

  • By: krs    latest    Aug 17, 2023 5:55 PM IST
Shruti Haasan | శృతిహాసన్‌కి కూడా అరుదైన వ్యాధి.. దీనికి ఆమె ఏం చేస్తుందంటే?

Shruti Haasan |

హీరోయిన్స్‌కు అరుదైన వ్యాధి ఉందని, ఆరోగ్యపరమైన సమస్యలున్నాయనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట కాదు. గౌతమి, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, మనీషా కొయిరాలా వంటి స్టార్ హీరోయిన్స్ ప్రాణాంతకరమైన క్యాన్సర్‌తో పోరాడి జయించారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఇక కొంత కాలంగా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రిఫ్లయ్‌గా ఆమె మీద ఫ్యాన్స్ పెడుతున్న సానుభూతి పోస్ట్ లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే శృతికి అసలు వ్యాధి ఉందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

హీరో కమల్ హాసన్ కూతురిగా కంటే తనకంటూ సొంత గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతి హాసన్. హీరోయిన్‌గా, గాయనిగా, మంచి డాన్స్‌గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే ఒకరు ఇద్దరు తప్ప అగ్రహీరోలందరి సరసనా నటించేసింది.

ఎలాంటి రొమాంటిక్ పాత్రకైనా నిర్మొహమాటంగా ఓకే చెప్పేస్తుంది కూడా. ఆమధ్య తెలుగుకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో మళ్లీ కమ్ బ్యాక్ అయి అలరించింది. త్వరలోనే పాన్ ఇండియన్ మూవీ సలార్ సినిమాతో ప్రభాస్‌తో కలిసి కనిపించనుంది. అలాంటి శృతి విషయంలో వినిపిస్తున్న ఈ హెల్త్ వార్త విషయానికి వస్తే..

శృతి చిన్న ఒత్తిడికి లోనైనా సరే తనకు తెలియకుండానే విపరీతమైన ఆవేశానికి గురవుతుందట. ఆ సమయంలో కోపం కూడా ఎక్కువగా ఉంటుందట. చిన్న విషయాలకే కోపంతో ఊగిపోయి, కోపం తగ్గగానే జరిగిందానికి పశ్చాతాపపడుతుందట. ఈ వింత వ్యాధి నుంచి తప్పించుకోవడానికి సంగీతం వింటూ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుందట శృతి హాసన్.

‘అన్నీ సాగితే రోగంమంత భోగము లేదన్నట్టు’.. ఈ వ్యాధి కాస్త ముదిరినా ప్రమాదమని కొందరంటుంటే.. సినిమా వాళ్ళకి ఏం వచ్చినా పెద్ద విశేషమే.. ఎవరికి మాత్రం కోపం రాదూ వీళ్ళకి అన్నీ విడ్డూరమే అనేవాళ్ళూ లేకపోలేదు. ఏదిఏమైనా.. హీరోయిన్లుకు ఇండస్ట్రీలో ఉండే కమిట్‌మెంట్సే వేరు. అలాంటప్పుడు ఇలాంటివి సహజమే మరి.