30 Years Prudhvi | ఆయనేం ఆస్కార్ లెవల్ కాదు.. అంబటి రాంబాబుపై శ్యాంబాబు షాకింగ్ కామెంట్స్
30 Years Prudhvi విధాత: మెగా హీరోల కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన సినిమా ‘బ్రో’. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించడం సినిమాకు హైప్ పెంచింది. మెగా హీరోలు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించాలనేది మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కంటున్న కల. అలాంటి సంబరాన్ని తెచ్చిన మూవీ ‘బ్రో’. ఈ సినిమా నిండా ఫన్‌తో పాటు కాస్త రాజకీయాల పంచ్‌లు కూడా త్రివిక్రమ్ దట్టించాడు. ముఖ్యంగా శ్యాంబాబు క్యారెక్టర్‌తో పండించిన కామెడీ చాలామందికి […]

30 Years Prudhvi
విధాత: మెగా హీరోల కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన సినిమా ‘బ్రో’. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించడం సినిమాకు హైప్ పెంచింది. మెగా హీరోలు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించాలనేది మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కంటున్న కల. అలాంటి సంబరాన్ని తెచ్చిన మూవీ ‘బ్రో’. ఈ సినిమా నిండా ఫన్‌తో పాటు కాస్త రాజకీయాల పంచ్‌లు కూడా త్రివిక్రమ్ దట్టించాడు.
ముఖ్యంగా శ్యాంబాబు క్యారెక్టర్‌తో పండించిన కామెడీ చాలామందికి కారం రాసిన ఫీలింగ్ కలిగించింది. ఇక ఈ క్యారెక్టర్‌తో వైఎస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబుని ఎద్దేవా చేశారనేలా సోషల్ మీడియాలో రిలీజ్ రోజు నుంచే మీమ్స్ నడుస్తున్నాయి. అంబటి రాంబాబు కూడా.. ఈ విషయమై సినిమా విడుదలైనప్పటి నుంచి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు.
అయితే ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ చేసిన నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా స్పందించారు. తనకు అంబటి రాంబాబు ఎవరో తెలీదన్నాడు. తనకు బ్రో సినిమా డైరెక్టర్ సన్నివేశాన్ని చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోయానని.. ఓ పనికి మాలినవాడు బార్లలో తాగి తిరిగే వాడి క్యారెక్టర్ అనగానే సరేనని అలాగే చేసానని, అంబటి రాంబాబు గారిని ఎక్కడా ఇమిటేట్ చేయలేదని, ఆయనేం ఆస్కార్ లెవల్ నటుడు కాదని సమాధానం ఇచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన రాజకీయ అంశాలను కూడా కామెడీ రూపంలో సినిమాలో పెట్టారనే కామెంట్‌ని తోసి పుచ్చారు పృథ్వీ. చాలా గ్యాప్ తర్వాత మంచి అవకాశం ఇచ్చినందుకు బ్రో నిర్మాతలకు, దర్శకునికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు చక్కని పారితోషకం కూడా ముట్టిందని తెలిపారు.
ఇక ఇదే టాపిక్ పై అంబటి రాంబాబు సరైన రాజకీయాలు చేయలేక సినిమాల్లో క్యారెక్టర్ ద్వారా ఇమిటేట్ చేస్తున్నారని ఇది శునకానందమని అంటూ నానా యాగీ చేస్తున్నారు. రాజకీయాలను ఎదుర్కోలేకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి. అంతే కాదు, ఈ సినిమా బడ్జెట్ అంత స్కాం అని ఢిల్లీ పెద్దల దగ్గర కంప్లయింట్ ఇవ్వడానికి వెళుతున్నట్లుగా కూడా సెలవిచ్చాడు.