Viral | లంచగొండి ఎస్ఐ.. నోట్ల‌ను మింగేందుకు య‌త్నం

Viral Video | ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. కానీ తాను లంచం తీసుకోలేద‌ని నిరూపించేందుకు ఆ ఎస్ఐ క‌రెన్సీ నోట్ల‌ను మింగే ప్ర‌య‌త్నం చేశాడు. మింగిన నోట్ల‌ను క‌క్కించేందుకు విజిలెన్స్ అధికారులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌కు చెందిన శుభ‌నాథ్ బ‌ర్రెలు ఇటీవ‌లే దొంగ‌త‌నానికి గుర‌య్యాయి. బ‌ర్రెల‌ను అప‌హ‌రించిన వ్య‌క్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు శుభ‌నాథ్‌. కానీ పోలీసులు ప‌ట్టించుకోవ‌డం […]

Viral | లంచగొండి ఎస్ఐ.. నోట్ల‌ను మింగేందుకు య‌త్నం

Viral Video | ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. కానీ తాను లంచం తీసుకోలేద‌ని నిరూపించేందుకు ఆ ఎస్ఐ క‌రెన్సీ నోట్ల‌ను మింగే ప్ర‌య‌త్నం చేశాడు. మింగిన నోట్ల‌ను క‌క్కించేందుకు విజిలెన్స్ అధికారులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌కు చెందిన శుభ‌నాథ్ బ‌ర్రెలు ఇటీవ‌లే దొంగ‌త‌నానికి గుర‌య్యాయి. బ‌ర్రెల‌ను అప‌హ‌రించిన వ్య‌క్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు శుభ‌నాథ్‌. కానీ పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎస్ఐ మహేంద్ర ఉలాకు మొర పెట్టుకున్నాడు.

లంచం ఇస్తేనే కేసు న‌మోదు చేస్తామ‌ని, నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని ఎస్ఐ మ‌హేంద్ర శుభ‌నాథ్‌కు స్ప‌ష్టం చేశాడు. అందుకు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు ఎస్ఐ. ఇక శుభ‌నాథ్ ఇటీవ‌లే రూ. 6 వేలు ఇచ్చాడు. మిగ‌తా డ‌బ్బుల కోసం ఎస్ఐ వేధించ‌డంతో.. చేసేదేమీ లేక శుభ‌నాథ్ హ‌ర్యానా విజిలెన్స్ అధికారులను సంప్ర‌దించాడు.

మంగ‌ళ‌వారం ఎస్ఐ లంచం తీసుకుంటుండ‌గా విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అధికారుల‌ను చూసిన ఎస్ఐ అప్ర‌మ‌త్త‌మైన ఆ క‌రెన్సీ నోట్ల‌ను మింగేందుకు య‌త్నించాడు. కానీ అధికారులు ఆ నోట్ల‌ను కక్కించారు.

ఈ క్ర‌మంలో అధికారుల‌కు, ఎస్ఐకి మ‌ధ్య తీవ్ర పెనుగులాట జ‌రిగింది. ఎస్ఐకి మ‌ద్ద‌తుగా ఓ వ్య‌క్తి అధికారుల‌పై వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఉన్న శుభ‌నాథ్ కూడా ఎస్ఐ చెంపపై కొట్టాడు. అనంత‌రం ఎస్ఐని అధికారులు అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు.