Singareni | 67.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి ఆల్ టైం రికార్డు..
రవాణాలోనూ సరికొత్త రికార్డు పలు విభాగాల్లో 13 అవార్డులను సాధించిన సింగరేణి 2023-2024లో 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం లక్ష్యాలను అధిగమించినందుకు కార్మికులకు సీఎండీ శ్రీధర్ అభినందనలు విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 సంవత్సరంలో 65.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం ద్వారా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 418 […]

- రవాణాలోనూ సరికొత్త రికార్డు
- పలు విభాగాల్లో 13 అవార్డులను సాధించిన సింగరేణి
- 2023-2024లో 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
- లక్ష్యాలను అధిగమించినందుకు కార్మికులకు సీఎండీ శ్రీధర్ అభినందనలు
విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 సంవత్సరంలో 65.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం ద్వారా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 418 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్‌ను తొలగించడం ద్వారా ఇదో కొత్త రికార్డును సృష్టించింది. అంతకుముందు 2017-18 సంవత్సరంలో 392 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ సింగరేణి తొలగించింది. దేశంలోని ఎనిమిది థర్మల్ పవర్ స్టేషన్లు, 2,000 ఇతర పరిశ్రమలకు 667 లక్షల టన్నుల బొగ్గును పంపడం ద్వారా బొగ్గు రవాణాలోను సింగరేణి కొత్త రికార్డు సృష్టించింది.
వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తిని సాధించినందుకు సింగరేణి ఉద్యోగులను SCCL చైర్మన్ ఎన్ శ్రీధర్ అభినందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 75 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకాల లక్ష్యాన్ని ఉద్యోగులు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా, మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్)తో 9304 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 2022-23 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 8741 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేసిందన్నారు.
థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుండి, సింగరేణి 57752 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, తెలంగాణ గ్రిడ్‌కు 54278 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసినట్టు చెప్పారు. సింగరేణి సంస్థ థర్మల్ పవర్ విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, ఫ్లై-యాష్ వినియోగం, అత్యధిక పీఎల్‌ఎఫ్ తదితర విభాగాల్లో 13 అవార్డులను సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
సౌర విద్యుత్ రంగంలో, సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలోని తొమ్మిది సోలార్ ప్రాజెక్టులలో 325 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, తెలంగాణ గ్రిడ్‌కు 318 మిలియన్ యూనిట్లను సరఫరా చేసిందన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సింగరేణి 50 శాతానికి పైగా విద్యుత్ బిల్లులను ఆదా చేసిందన్నారు.