Skin Disease | వాతావరణంలో మార్పులు విజృంభిస్తున్న చర్మవ్యాధులు.. స్టెరాయిడ్స్ అధికంగా వాడొద్దంటున్న నిపుణులు..
Skin Disease | వాతావరణ మార్పులతో చర్మవాధ్యులు సైతం విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతుండడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వాతావరణం వేడెక్కుతుండంతో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. చర్మవ్యాధుల బాధితులు ప్రారంభంలో అప్రమత్తంగా ఉంటే సమస్యను వేగంగా నివారించవచ్చని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యాధులు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డెర్మలాలజీ విభాగం అధిపతి డాక్టర్ కబీర్ సర్దానా మాట్లాడుతూ కొన్ని మందులు […]

Skin Disease | వాతావరణ మార్పులతో చర్మవాధ్యులు సైతం విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతుండడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వాతావరణం వేడెక్కుతుండంతో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
చర్మవ్యాధుల బాధితులు ప్రారంభంలో అప్రమత్తంగా ఉంటే సమస్యను వేగంగా నివారించవచ్చని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యాధులు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డెర్మలాలజీ విభాగం అధిపతి డాక్టర్ కబీర్ సర్దానా మాట్లాడుతూ కొన్ని మందులు ఫంగస్‌కు వ్యతిరేకంగా వేగంగా నిరోధకశక్తిని పెంచుతాయన్నారు.
అదే సందర్భంలో ఆయా మందులను సబ్బు, పొడి రూపంలో ఉపయోగించకూడదని, రోగి పరిస్థితిని బట్టి సరైన మోతాదులో వాడాలన్నారు. డెర్మటాలజీ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ మనీష్ జాంగ్రా మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్నా స్టెరాయిడ్స్ ఉన్న ఓటీసీ మందులను వాడొద్దని సూచించారు.
ఇవి ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను పెంచుతాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉండేలా చూసుకోవాలని, ఈ ప్రోబయోటిక్స్ శరీరం ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే హానికరమైన శిలీంధ్రాలతో పోరాడేందుకు సహాయపడుతుందన్నారు.
వేసవిలో సమస్య పెరుగుతుంది
వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా సాధారణమని చర్మవ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువగా ఆక్సిలరీ, జఘన మడతలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సాధారణంగా డెర్మాటోఫైట్స్ అని పిలువబడే శిలీంధ్రాల సమూహం వల్ల సంభవిస్తాయని, అది అంటువ్యాధి అన్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాధిని కలిగించే శిలీంధ్రాలు సోకిన జంతువుల నుంచి కలుషితమైన నేలను తాకిన సమయంలోనూ సోకుతుందని పేర్కొన్నారు.
చర్మ సమస్యల లక్షణాలు..
- చర్మ నష్టం జరగుతుంది.
- ఎర్రబారుతుంది.
- దురద ఉటుంది.
- వాపు వస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు..
- అథ్లెట్ ఫుట్‌జాక్
- గజ్జి
- రింగ్వార్మ్
- జననాంగంలో దురద
నివారణ ఎలా..
- శుభ్రమైన బట్టలతో పాటు పొడి బట్టలు ధరించాలి
- బిగుతుగా ఉండే బట్టలు, బూట్లు ధరించడం మానాలి.
- రోజుకు కనీసం ఒక్కసారైనా స్నానం చేయాలి.
- మీ గోళ్లు పొడుగ్గా ఉంటే కట్‌చేసి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దు.