Special Buses | పురుషులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మహలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ వసతి కల్పించడంతో పురుషులకు ప్రత్యేక బస్సులను ప్రారంభించింది.
Special Buses | విధాత : మహలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ వసతి కల్పించడంతో పురుషులకు బస్సుల్లో సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ పురుషులకు ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. రద్ధీ అధికంగా ఉన్న రూట్లలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
పురుషులకు మాత్రమే అని బోర్డులతో కూడిన ప్రత్యేక బస్సులను ఎల్బీనగర్-ఇబ్రహీంపట్నం రూట్‌లో గురువారం నుంచి ప్రారంభించారు. ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పుల చొప్పున నడిపిస్తుండగా, త్వరలో మరిన్ని రూట్లలో ఈ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లుగా ఆర్టీసీ వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram