Sreemukhi | షోలో ముద్దు పెట్ట‌బోయిన అవినాష్‌.. చెంప చెళ్లుమ‌నిపించిన శ్రీముఖి

Sreemukhi: ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ప‌లు రియాలిటీ షోలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న విష‌యం తెలిసిందే. వాటిలో శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఒక‌టి. ప్ర‌తి ఆదివారం ప్ర‌సారం అయ్యే ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఈ ఎపిసోడ్ కోసం సీరియ‌ల్స్ తో ఫేమ‌స్ అయిన బుల్లితెర స్టార్స్ హాజ‌ర‌య్యారు. త‌న కామెడీతో తెగ న‌వ్వించే అవినాష్ ఈ సారి రెట్రో ఓల్డ్ థీమ్ తీసుకొని ఆ టైప్ కాస్ట్యూమ్‌తో […]

  • By: sn    latest    Jul 21, 2023 1:38 AM IST
Sreemukhi | షోలో ముద్దు పెట్ట‌బోయిన అవినాష్‌.. చెంప చెళ్లుమ‌నిపించిన శ్రీముఖి

Sreemukhi: ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ప‌లు రియాలిటీ షోలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న విష‌యం తెలిసిందే. వాటిలో శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఒక‌టి. ప్ర‌తి ఆదివారం ప్ర‌సారం అయ్యే ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది.

ఈ ఎపిసోడ్ కోసం సీరియ‌ల్స్ తో ఫేమ‌స్ అయిన బుల్లితెర స్టార్స్ హాజ‌ర‌య్యారు. త‌న కామెడీతో తెగ న‌వ్వించే అవినాష్ ఈ సారి రెట్రో ఓల్డ్ థీమ్ తీసుకొని ఆ టైప్ కాస్ట్యూమ్‌తో వ‌చ్చాడు. ఇక ఎప్ప‌టిలానే ఫైమా,హ‌రి కూడా త‌మ‌దైన పంచ్‌ల‌తో న‌వ్వించారు. అయితే ప్రోమోలో సీరియ‌ల్ ఆర్టిస్ట్ లు అంతా కూడా వెరైటీ టాస్క్‌లు, పంచ్‌లు వేస్తూ సంద‌డి చేశారు.

ఇక శ్రీముఖి త‌న మాట‌ల‌తో ఎంత సంద‌డి చేస్తుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెర స్టార్స్ తో ఓ ఆట ఆడుకునే ప్ర‌య‌త్నం శ్రీముఖి చేయ‌గా, సీరియ‌ల్ ఆర్టిస్ట్‌లు కూడా త‌గ్గేదే లే అన్న‌ట్టు ఆమెపై పంచ్‌లు వేశారు. ఇక అవినాష్ ఓవ‌ర్ యాక్ష‌న్‌కి శ్రీముఖి అత‌ని చెంప చెళ్లుమ‌నిపించింది.

శ్రీముఖి.. ఓ డైలాగ్ చెబుతూ.. పార్థు… ఒక్కసారి నా ద‌గ్గ‌ర‌కు వచ్చి ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతుంది. శ్రీముఖి అలా లాగేస‌రికి అవినాష్ రెచ్చిపోయి ఆమెని ముద్దు పెట్టుకోబోయాడు. పూర్తిగా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయి నిజంగానే శ్రీముఖిని ముద్దుపెట్టుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంతో శ్రీముఖి అత‌ని గూబ గుయ్యిమ‌నిపించింది.

శ్రీముఖి స్లోగానే కొట్టాల‌ని అనుకోగా, ఫ్లోలో కాస్త గ‌ట్టిగానే త‌గిలిన‌ట్టు తెలుస్తుంది. అవినాష్ ఎక్స్ ప్రెష‌న్, ఆ సౌండ్ విని అంతా షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత తెగ న‌వ్వేశారు కూడా. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తుంది. ప్రోమోనే ఈ రేంజ్‌లో వినోదం పంచితే ఫుల్ ఎపిసోడ్ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. కాగా, ప‌టాస్‌తో పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకుంది.