Sruthi Hassan: కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. తన సినిమాలతోనో లేదంటే బాయ్ ఫ్రెండ్ తో చేసే రచ్చతోనో శృతి హాట్ టాపిక్ అవుతుంది. అయితే కరోనా సమయం నుండి ఈ అమ్మడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో డేటింగ్ చేస్తుంది. వీరిద్దరు కలిసి చేసే సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడప్పుడు శృతి హాసన్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ ఇద్దరు ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. […]
Sruthi Hassan: కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. తన సినిమాలతోనో లేదంటే బాయ్ ఫ్రెండ్ తో చేసే రచ్చతోనో శృతి హాట్ టాపిక్ అవుతుంది. అయితే కరోనా సమయం నుండి ఈ అమ్మడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో డేటింగ్ చేస్తుంది. వీరిద్దరు కలిసి చేసే సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడప్పుడు శృతి హాసన్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ ఇద్దరు ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. పబ్లిక్‌గా హగ్గులు, ముద్దులు ఇచ్చుకుంటూ ఎయిర్‌పోర్ట్‌లో నానా రచ్చ చేశారు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ ఏంటా పిచ్చి పనులు అంటూ చురకలు అంటిస్తున్నారు.
శృతి హాసన్ గతంలో ఓ విదేశీ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉండి కొన్నాళ్ల పాటు సినిమాలు కూడా మానేసింది. క్రాక్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇక వరుస సక్సెస్ లు సాధించి తన సత్తా చూపించింది. ఈ ఏడాది బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలలో నటించి రెండు బ్లాక్ బస్టర్స్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శృతి ఇటు కుర్ర హీరోలతో పాటు అటు సీనియర్ హీరోలకి కూడా బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.
ఇక నానితో కూడా శృతి హాసన్ ఓ చిత్రం చేస్తుంది. ఒకవైపు తన ప్రియుడితో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ పోతుంది శృతి హాసన్. కమల్ గారాలపట్టి లాక్ సమయంలో శాంతనుతో సందడి ఏ రేంజ్లో చేసిందో మనం చూశాం. ఇటీవలి కాలంలో వీరిద్దరు తరచు కలిసే కనిపిస్తున్నారు. కలిసి వెళ్లడం, కలిసి తినడం, ఇంట్లో ఉన్నప్పుడు ప్రియుడి ఒళ్లో పడుకుని సేద తీరడం, తన ప్రియుడితో కలిసి చిలిపి పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైన ప్రస్తుతం శృతి లైఫ్‌లో అంతా గుడ్ టైం నడుస్తుందనే చెప్పాలి.