KTR vs Mahesh Kumar Goud: మళ్లీ విగ్రహాల రచ్చ…కేటీఆర్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్!

గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు చేసే క్రమంలో తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలపై చేసిన వ్యాఖ్యలు..వాటికి పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయి.

KTR vs Mahesh Kumar Goud: మళ్లీ విగ్రహాల రచ్చ…కేటీఆర్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్!

KTR vs Mahesh Kumar Goud:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య సభ బయట సాగిన మాటల యుద్ధం చూస్తే ఈ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయన్న సంకేతాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మీడియా పాయింట్ లో  విమర్శలు చేసే క్రమంలో చేసిన వ్యాఖ్యలు..వాటికి పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయి.

గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ, రాష్ట్ర సాధన పోరాటాలను గుర్తిస్తూ గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి వంటి వారిని గౌరవిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర అధికారిక గేయంగా జయజయహే తెలంగాణను, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ప్రభుత్వం గుర్తు చేసింది. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ కేటీఆర్ మాట్లాడుతూ కకాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే చెప్పిందని మండిపడ్డారు.

ఇదే క్రమంలో సెక్రటేరియట్ లోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ధి సెక్రటేరియట్ లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీని సెక్రటేయట్ ముందుపెట్టి తెలంగాణను ఉద్ధరించినట్లుగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుండి మంచిగా భద్రంగా మూట కట్టి గాంధీ భవన్‌కు పంపిస్తాం, ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహంపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ తల్లి, రాహుల్‌ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాలపై కేటీఆర్ చేయి వేస్తే బట్టలూడదీసి కొడతామని ఘాటుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, మహేశ్ కుమార్ గౌడ్ ల మధ్య రేగిన మాటల మంటలు బడ్జెట్ సమావేశాలలో రెండు పార్టీల మధ్య మరింతగా రాజుకోవడం తధ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.