మంచిర్యాల సభ విజయవంతం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
సత్యాగ్రహ సభకు పోటెత్తిన జనం. తెలంగాణ పీసీసీ ముఖ్య నేతల అంతా హాజరు పార్టీలో జోష్ నింపిన సత్యాగ్రహ సభ మంచిర్యాల గడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అడ్డ అంటూ నాయకుల హుషారు ప్రసంగాలు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కు మంచిర్యాలలో ఘన స్వాగతం రేవంత్ , భట్టి ప్రసంగాలకు అనూహ్య స్పందన విధాత, ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో […]

- సత్యాగ్రహ సభకు పోటెత్తిన జనం.
- తెలంగాణ పీసీసీ ముఖ్య నేతల అంతా హాజరు
- పార్టీలో జోష్ నింపిన సత్యాగ్రహ సభ
- మంచిర్యాల గడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అడ్డ అంటూ నాయకుల హుషారు ప్రసంగాలు
- ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కు మంచిర్యాలలో ఘన స్వాగతం
- రేవంత్ , భట్టి ప్రసంగాలకు అనూహ్య స్పందన
విధాత, ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నిన్న మొన్నటి వరకు ఎడమొహం పడమొహంతో ఉన్న నేతలంతా ఒకే వేదిక మీదికి వచ్చారు.
పెద్ద ఎత్తున సత్యాగ్రహ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారం కైవసం అంటూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సత్యాగ్రహ సభ వేదిక పైన రాష్ట్రానికి సంబంధించిన పిసిసి కమిటీ సభ్యులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు సభా వేదికపై ఓరెత్తిన ప్రసంగాలు చేయడంతో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
సత్యాగ్రహ దీక్ష సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ ఠాక్రే వేదికపై రావడంతోనే సభ ప్రారంభమైంది. ముందుగా ఎఐసిసి అధ్యక్షుడు పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వల చేసి సభను ప్రారంభించారు. డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సత్యాగ్రహ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో భట్టి పాదయాత్ర తో పాటు ఈ సత్యాగ్రహ బహిరంగ సభ విజయవంతం కావడంతో రాబోయేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని నాయకులు తమ సందేశాల్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సభలో ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అయినవి . రేవంత్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రజల నుండి చప్పట్లు రావడం జోష్ పెంచింది .
కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేడీ ప్రభుత్వం అంటూ రెండు అరాచక ప్రభుత్వాలంటూ ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలను చైతన్య పరిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కునే శక్తి లేక రాహుల్ గాంధీని పార్లమెంట్ కు రాకుండా రెండేళ్ల పాటు అనార్హత వేటు వేయడాన్ని సభలో అందరూ ముక్తకంఠంతో ఖండించారు.
అక్కడ బిజెపి ఇక్కడ బిఆర్ఎస్ దొందు దొందేనని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని త్వరలోనే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బిడ్డ లీకు కేసులో కొడుకు ఇరిగేషన్ ప్రాజెక్టులో అల్లుడు అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలు గుర్తొస్తారని ఎన్నికల తరువాత ప్రజా సంక్షేమం విస్మరిస్తారని అన్నారు. 9 ఏళ్ల కాలంలో అంబేద్కర్ విగ్రహానికి మోక్షం రాలేదు కానీ ఎన్నికల సంవత్సరంలో దళిత గిరిజనుల నుండి వ్యతిరేక వస్తుందని అందులో భాగంగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారని తెలిపారు.
పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కాదు అణగారిన వర్గాలైన దళిత గిరిజనులకు ఏం చేశారని సభ నుంచి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల ముందు ఉదరగొట్టి ప్రజలను వంచించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకులు లిక్కర్ దందాలతోనే మునిగితేలుతు ప్రజా సంక్షేమం విస్మరించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు దళిత గిరిజనులకు లావాని పోడు భూములు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు . సింగరేణిలో లక్ష 16 వేల మంది కార్మికులు ఉండగా వారిని దశలవారీగా 42వేల మంది కార్మికులకు కుదించారని తెలిపారు . బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ భూగర్భ గనుల సంఖ్యను తగ్గించి ఓసిపి గనులను పెంచుతూ ఓపెన్ కాస్ట్ గనులను బడా కాంట్రాక్టర్లకు అప్పజెప్పి స్థానికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి భూగర్భ గనులను పెంచుతూ ప్రైవేటీకరణను అడ్డుకుంటా మని హామీ ఇచ్చారు. బట్టి పాదయాత్ర గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను తలపిస్తుందని అలాగే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని కాలేశ్వరం ప్రాజెక్టులొనే బొంద పెడతామని ఎద్దేవ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సత్యాగ్రహ సభలో నేతలంతా ఐక్యత రాగం వినిపించి కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచి విజయవంతం చేశారు. ఈ ఐక్యత అన్నది కడవరకు ఉంటదా ? లేక తమలోతమే మళ్లీ వర్గ విభేదాలతో ఎదుటి పక్షాల వారికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే ?