సుమ అడ్డాలో ‘మెగాస్టార్’ చిరు
విధాత: ఇటీవల యాంకర్ సుమ ‘సుమ అడ్డా’ అనే ఒక కొత్త గేమ్ షో ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసింది. ఈ గేమ్ షోకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రావడం విశేషమనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు చిరు ఇలాంటి గేమ్ షో లో ఎప్పుడు కనిపించలేదు. మరి మెగాస్టార్ బుల్లితెరపై ఎలా సందడి చేస్తారో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమ చేసిన షోలలో క్యాష్ షో చాలా పాపులర్ అయింది. ఇందులో ఎంతో […]

విధాత: ఇటీవల యాంకర్ సుమ ‘సుమ అడ్డా’ అనే ఒక కొత్త గేమ్ షో ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసింది. ఈ గేమ్ షోకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రావడం విశేషమనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు చిరు ఇలాంటి గేమ్ షో లో ఎప్పుడు కనిపించలేదు. మరి మెగాస్టార్ బుల్లితెరపై ఎలా సందడి చేస్తారో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమ చేసిన షోలలో క్యాష్ షో చాలా పాపులర్ అయింది. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు సందడి చేశారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు హాజరయ్యారు. అయితే ఇటీవల ఈ షోకి సుమ ఫుల్ స్టాప్ పెట్టింది. సుమ అడ్డా అనే కొత్త షోను స్టార్ట్ చేసింది. దీనికి తొలి ఎపిసోడ్లో సంతోష్ శోభన్ టీం ఓ కార్యక్రమం చేశారు. ఇది సంక్రాంతికి విడుదల కానున్న కళ్యాణం కమనీయం సినిమా ప్రమోషన్స్‌కి వాడుకున్నారు. రెండో ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ గెస్ట్‌లుగా వచ్చారు. మెగాస్టార్ చిరు ఒక టీవీ గేమ్ షో కి హాజరు కావడం పెద్ద విషయమే.
Suma Garu Vibing To #PoonakaaluLoading Song Along With Our Mega Star @KChiruTweets Garu