వామ్మో.. 82 ఏళ్ల వ‌య‌స్సులో సుమ త‌ల్లి జిమ్ వ‌ర్క‌వుట్స్.. అంద‌రు షాక్

  • By: sn    latest    Oct 13, 2023 12:51 PM IST
వామ్మో.. 82 ఏళ్ల వ‌య‌స్సులో సుమ త‌ల్లి జిమ్ వ‌ర్క‌వుట్స్.. అంద‌రు షాక్

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి సుమ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యాంక‌ర్‌గా అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ సుమ సొంతం. ఇప్ప‌టికీ కుర్ర యాంక‌ర్స్‌కి ధీటుగా షోస్ చేస్తూ త‌న స‌త్తా ఏంటో నిరూపించుకుంటుంది. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సుమ మారుతూ వస్తుంది. టీవీ షోస్‌తో మాత్ర‌మే కాకుండా సోష‌ల్ మీడియా ద్వారా కూడా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. సుమ తన సోష‌ల్ మీడియా ద్వారా అప్పుడ‌ప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన పలు విష‌యాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. గ‌తంలో సుమ ప‌లు వీడియోలు షేర్ చేస్తూ… అందులో తన తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.

అప్ప‌ట్లో సుమ షేర్ చేసిన వీడియోలో తన తల్లి ఎంత స్ట్రాంగ్ అనేది చెబుతూ వర్కౌట్ వీడియోలను పంచుకుంది. తాజాగా మరోసారి సుమ తన మదర్ వర్కౌట్ల గురించి చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. 82 ఏళ్ల వయసులోనూ సుమ త‌ల్లి వ‌ర్క‌వుట్స్ చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. మీరు వర్కౌట్లు చేయకుండా ఉండటానికి ఏమైనా కారణాలు ఉంటే మా అమ్మను చూడండి.. ఆమెకు 82.. ఏ ఒక్క రోజు కూడా జిమ్, వర్కౌట్లు చేయ‌కుండా లేదు.. అంటూ తన తల్లి గురించి చెబుతూ అందరిలోనూ స్పూర్తిని నింపే ప్ర‌య‌త్నం చేసింది.నిజంగా సుమ త‌ల్లి జిమ్ వీడియోని చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఆమె డెడికేష‌న్‌కి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందేనంటున్నారు.

ఇక సుమ ఈ వీడియోలో కనిపించిన తీరు చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏ మాత్రం మేక‌ప్ లేకుండా సుమ కెమెరా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోఉన్నారు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు మేక‌ప్ లేకుండా పెద్ద‌గా క‌నిపించ‌రు. కాని సుమ మాత్రం అవేమి ప‌ట్టించుకోకుండా విత్ ఔట్ మేక‌ప్‌తో క‌నిపించి అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర‌చింది. ఇక సుమ రీసెంట్‌గా తన కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి మరీ హోస్ట్ చేసింది. టీజ‌ర్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమా హిట్ అవుతుంద‌ని అంటున్నారు. నాని టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే.