వారెవ్వా.. ఈ ట్రావెల్ క్రెడిట్ కార్డులు అదుర్స్
వినియోగదారులకు ఎన్నెన్నో ప్రయోజనాలు విధాత: క్రెడిట్ కార్డులు అనేక రకాల ప్రయోజనాలతో వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వ్యక్తుల అవసరాలు, అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఆయా కంపెనీలు ఈ క్రెడిట్ కార్డులకున్న లాభాలను తీర్చిదిద్దుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రావెల్ క్రెడిట్ కార్డులూ లభిస్తున్నాయిప్పుడు. మరో నెలన్నర, రెండు నెలల్లో విద్యార్థులకు సెలవుల సందడి మొదలవబోతున్నది. దీంతో చాలా కుటుంబాలు విహారయాత్రలకు సిద్ధమవడం సహజమే. ఇలాంటి వారందరికీ ఆయా బ్యాంకులు ట్రావెల్ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. HDFC బ్యాంక్ […]

వినియోగదారులకు ఎన్నెన్నో ప్రయోజనాలు
విధాత: క్రెడిట్ కార్డులు అనేక రకాల ప్రయోజనాలతో వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వ్యక్తుల అవసరాలు, అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఆయా కంపెనీలు ఈ క్రెడిట్ కార్డులకున్న లాభాలను తీర్చిదిద్దుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రావెల్ క్రెడిట్ కార్డులూ లభిస్తున్నాయిప్పుడు.
మరో నెలన్నర, రెండు నెలల్లో విద్యార్థులకు సెలవుల సందడి మొదలవబోతున్నది. దీంతో చాలా కుటుంబాలు విహారయాత్రలకు సిద్ధమవడం సహజమే. ఇలాంటి వారందరికీ ఆయా బ్యాంకులు ట్రావెల్ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి.
HDFC బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు
మొదటి సంవత్సరం 90 రోజుల్లోనే రూ.15,000 ఖర్చు చేస్తే ఎటువంటి ఫీజులు ఉండవు. అలాగే రెండో ఏడాది వార్షిక వ్యయం రూ.75,000 దాటితే ఫీజులు వర్తించవు. ప్రతీ రూ.150 ఖర్చుపై రెండు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. లాంజ్ యాక్సెస్, ఇంధన కొనుగోళ్లపై ఏటా గరిష్ఠంగా పొదుపు చేసుకోవచ్చు. ఏదైనా కొన్న దగ్గర్నుంచి 50 రోజులదాకా వడ్డీ లేని క్రెడిట్ ఉంటుంది. మరిన్ని లాభాలూ ఉంటాయి.
యాత్రా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్
ఆరంభ ఫీజుగా తొలి ఏడాది రూ.499 (పన్నులు అదనం) చెల్లించాలి. వడ్డీరేటు నెలకు 3.5 శాతం వరకు ఉంటుంది. సినిమాలు, హోటల్స్, కిరాణా కోసం ఖర్చు చేసే ప్రతీ రూ.100కు 6 రివార్డు పాయింట్లు. అంతర్జాతీయంగా ఖర్చుచేసే ప్రతీ రూ.100కూ 6 పాయింట్లుంటాయి. ఇంకొన్ని ప్రయోజనాలూ అందుకోవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ మైల్స్ అండ్ మోర్ క్రెడిట్ కార్డ్
తరచూ విదేశాలకు వెళ్లేవారికి ఈ క్రెడిట్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీయ ప్రయాణాలకూ వాడుకోవచ్చు. రిడీమబుల్ రివార్డ్ పాయింట్లు ఉంటాయి. అలాగే దేశంలోని 30కిపైగా విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కార్డుపై వడ్డీరేటు నెలకు 3.4 శాతం. ఇక జాయినింగ్ ఫీ రూ.3,500, వరల్డ్ క్రెడిట్ కార్డు కావాలనుకుంటే ఏటా రూ.3,500 చెల్లించాలి.
యాక్సిస్ బ్యాంక్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్
వివిధ రకాల రాయితీలు, ప్రోత్సాహకాలను ఈ కార్డు వినియోగదారులు అందుకోవచ్చు. హోటల్స్, ఇంధన కొనుగోళ్లు, షాపింగ్‌లకు ఉపయుక్తంగా ఉంటుంది. ఏటా రెండుసార్లు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ప్రాధాన్యత కస్టమర్లకు జాయినింగ్ ఫీలో రూ.1,000 తగ్గిస్తారు. వార్షిక ఫీ రూ.1,500. ఏటా ఖర్చు రూ.4 లక్షలు దాటితే ఇది కూడా ఉండదు.
ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినం ఆరా క్రెడిట్ కార్డు
ఇందులో బీమా,ఫ్లెక్సిబుల్ రివార్డు పాయింట్లు, ఇంధన కొనుగోళ్లపై ప్రోత్సాహకాలుంటాయి. ఈజీ డిన్నర్, వెరమోడా, బాటా వోచర్లు వెల్‌కమ్ బెనిఫిట్స్‌గా లభిస్తాయి. కస్టమర్లకు మరిన్ని లాభాలూ దీనిపై వర్తిస్తాయని బ్యాంక్ చెప్తున్నది.