Supreme Court: అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
Supreme Court ఆయన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధింపు ఆ ఉత్తర్వులు పేలవమైనవి తప్పుపట్టింది విధాత: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే ఇచ్చింది. ఈ నెల 25 వరకూ అవినాశ్‌ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత […]
Supreme Court
- ఆయన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధింపు
- ఆ ఉత్తర్వులు పేలవమైనవి తప్పుపట్టింది
విధాత: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే ఇచ్చింది.
ఈ నెల 25 వరకూ అవినాశ్‌ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
హైకోర్టు విచారణపైనా సుప్రీం స్టే విధించి ఆ ఉత్తర్వులు ఆమోదయోగ్యం కావని అభిప్రాయపడింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పేలవమైనవని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. సోమవారం మరోసారి ఈకేసులో పూర్తి స్థాయి విచారణ చేపడుతామని, అప్పుడు అన్ని విషయాలను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
అవినాష్‌కు సుప్రీం(Supreme Court) నోటీసులు జారీ చేసి, సోమవారం వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నెల 30 లోపు కేసు పూర్తి చేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పొడిగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram