Suryapeta | సాహసం చేశాడు.. కరెంటు తెచ్చాడు

Suryapeta విధాత: సూర్యాపేట జిల్లా పాతర్లపహడ్‌లో వర్షాలు, ఈదురుగాలులతో కరెంటు వైర్లు తెగిపోయి గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న లైన్ మెన్ కొప్పుల సంతోష్ వరద నీటిలోనే ఈదుకుంటు స్తంభం వద్ధకు వెళ్లి పైకి ఎక్కి మరమ్మతులు చేశాడు. ప్రాణాలకు తెగించి వర్షాలు, వరదల్లో సాహసం చేసి గ్రామానికి విద్యుత్తు సరఫరా చేసిన లైన్‌మెన్ సంతోష్‌ను మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అభినందిస్తు ట్వీట్ చేశారు. సంతోష్ వరద నీటిలో ఈదుతు వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు […]

Suryapeta | సాహసం చేశాడు.. కరెంటు తెచ్చాడు

Suryapeta

విధాత: సూర్యాపేట జిల్లా పాతర్లపహడ్‌లో వర్షాలు, ఈదురుగాలులతో కరెంటు వైర్లు తెగిపోయి గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న లైన్ మెన్ కొప్పుల సంతోష్ వరద నీటిలోనే ఈదుకుంటు స్తంభం వద్ధకు వెళ్లి పైకి ఎక్కి మరమ్మతులు చేశాడు.

ప్రాణాలకు తెగించి వర్షాలు, వరదల్లో సాహసం చేసి గ్రామానికి విద్యుత్తు సరఫరా చేసిన లైన్‌మెన్ సంతోష్‌ను మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అభినందిస్తు ట్వీట్ చేశారు. సంతోష్ వరద నీటిలో ఈదుతు వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు చేసిన వీడియో వైరల్‌గా మారింది.