T Congress | BRS నేత‌ల క‌బ్జాలో.. 111 జీవో భూములు: కోదండ రెడ్డి

T Congress భూములు BRS నేత‌ల చేతుల్లోకి వెళ్లిన త‌రువాత‌నే జీవో ఎత్తి వేశారు హైదరాబాద్ కు వరద ముంపు నుంచి కాపాడేందుకు నిజాం జంట జలాశయాలు నిర్మించారు భవిష్యత్ తరాల అవసరాలను విస్మరించి ఆదరాబాదరాగా 111 జీవో ఎత్తేశారు విధాత‌: 111 జీవో పరిధిలో మెజారిటీ భూమి BRS నేతల కబ్జాలో ఉందని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌ సెల్ జాతీయ ఉపాధ్య‌క్షులు కోదండ‌రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు గురువారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 111 […]

  • By: krs    latest    Jul 20, 2023 12:30 AM IST
T Congress | BRS నేత‌ల క‌బ్జాలో.. 111 జీవో భూములు: కోదండ రెడ్డి

T Congress

  • భూములు BRS నేత‌ల చేతుల్లోకి వెళ్లిన త‌రువాత‌నే జీవో ఎత్తి వేశారు
  • హైదరాబాద్ కు వరద ముంపు నుంచి కాపాడేందుకు నిజాం జంట జలాశయాలు నిర్మించారు
  • భవిష్యత్ తరాల అవసరాలను విస్మరించి ఆదరాబాదరాగా 111 జీవో ఎత్తేశారు

విధాత‌: 111 జీవో పరిధిలో మెజారిటీ భూమి BRS నేతల కబ్జాలో ఉందని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌ సెల్ జాతీయ ఉపాధ్య‌క్షులు కోదండ‌రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు గురువారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 111 జీవో ఎత్తేసేటప్పుడు ప్రభుత్వం అక్కడి గ్రామాల రైతులను పట్టించు కోలేదన్నారు. ఈ ప్రాంతంలోని మెజార్టీ భూములు BRS నేత‌ల చేతుల్లోకి వెళ్లిన త‌రువాత‌నే జీవో ఎత్తి వేశార‌ని ఆరోపించారు. ఈ జీవో ఎత్తి వేయ‌డం వ‌ల్ల కేవ‌లం BRS నేత‌లకు మాత్ర‌మే లాభ‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 111 జీవోను ఎత్తివేయ‌డం మూలంగా 84 గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గ‌లేద‌న్నారు.

కేవ‌లం BRS నేత‌ల‌కు మాత్ర‌మే ల‌బ్ది జ‌రిగింద‌ని ఆరోపించారు. అక్కడ మల్టీ స్టోర్ బిల్డింగ్ లు నిర్మాణం జరుగుతున్నాయని, అక్కడ దాదాపు 25 వేల కుటుంబాలు నివాసం ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ కు వరద ముంపు నుంచి కాపాడేందుకు జంట జలాశయాలు నిజాం నిర్మించారు, వీటి వల్ల జంట నగరాలకు మంచినీటి సరఫరా జరిగిందని తెలిపారు. 111 జీవో పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి, జంట జలాశయాలు ఎండిపోతే వాళ్ళు మంచినీటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం భవిష్యత్ తరాల అవసరాలను విస్మరించి ఆదరాబాదరాగా 111 జీవో ఎత్తేశారన్నారు.

ఈ జీవో పరిధిలో ఉన్న రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది కోదండ‌రెడ్డి అన్నారు. 111 జీవో పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి పూర్తి సమాచారం సేకరించామ‌న్నారు. జంట జలాశయాలు పరిరక్షణ, చెరువుల రక్షణ, అక్కడి రైతుల ప్రయోజనాలను కాపాడెలా మా రిపోర్ట్ రూపొందించామ‌ని, 111 జీవో పరిధిలో రూపొందించిన రిపోర్ట్ పీసీసీ చీఫ్ కు అందజేయనున్నామ‌ని కోదండ‌రెడ్డి వెల్ల‌డించారు.