Mandula Samuel : ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్లతో దాడి

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసి నిరసన తెలిపారు. హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 16, 2026, 4:28 pm IST
Read Time: 3 mins
Mandula Samuel : ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్లతో దాడి

విధాత, హైదరాబాద్ : హిందూ ధర్మాన్ని, వేదాలను, బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించి కోడిగుడ్లతో దాడి చేశారు. బోడుప్పల్‌ లోని ఆయన నివాసంపై బీజేవైఎం కార్యకర్తులు కోడిగుడ్లతో దాడి చేసి నిరసన తెలిపారు.

ఎన్నికల సమయంలో దేవాలయాల్లో పొర్లు దండాలు పెట్టి, ఇప్పుడు హిందూ సమాజాన్ని అవమానించడం తగదని విమర్శించారు. మందుల సామేల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24 గంటల్లోగా సామేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఇవి కూడా చదవండి :

Neuroscience | ఫ్రీజ్ చేసిన మెదడుకు మళ్లీ జీవం పోసిన శాస్త్రవేత్తలు.. క్రయోప్రిజర్వేషన్‌లో విప్లవాత్మక ముందడుగు
Tadoba Tiger : పెద్దపులితో ఇలాగేనా?…దాడి చేస్తే అంతే !