MEDAK: లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు స‌స్పెండ్‌

సూరారం జ‌డ్పీ పాఠశాల హెచ్ఎం యాదగిరి సస్పెండ్ ఉత్త‌ర్వులు జారీ చేసిన డీఈఓ రాధాకిష‌న్‌ Teacher suspended for sexual harassment విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చిన్న శంకరం పెట్ మండలం సూరారం జ‌డ్పీ(zp) పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాఇని లైంగికంగా వేధించిన ప్ర‌ధానోపాధ్యాయుడు యాదగిరి(HM Yadagiri)ని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్(Medak District Education Officer Radhakishan) సస్పెండ్(suspend) చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో పని చేస్తున్న […]

MEDAK: లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు స‌స్పెండ్‌
  • సూరారం జ‌డ్పీ పాఠశాల హెచ్ఎం యాదగిరి సస్పెండ్
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన డీఈఓ రాధాకిష‌న్‌

Teacher suspended for sexual harassment
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చిన్న శంకరం పెట్ మండలం సూరారం జ‌డ్పీ(zp) పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాఇని లైంగికంగా వేధించిన ప్ర‌ధానోపాధ్యాయుడు యాదగిరి(HM Yadagiri)ని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్(Medak District Education Officer Radhakishan) సస్పెండ్(suspend) చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలలో పని చేస్తున్న సహ ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డీఈవో కార్యాలయంలో కూడ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను పాఠశాల ఇన్‌చార్జి హెచ్ ఎం వెంకయ్యకు ఎంఈఓ యాదగిరి అందించారు.