Rohit Sharma | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ.. మరోసారి సెంచరీల మోత మోగనుందా..?
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజు వీఐసీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ తన భార్య, కూతురితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రోహిత్ శర్మ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనానంతరం రోహిత్ శర్మ దంపతులకు రంగనాయక మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు రోహిత్ శర్మను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం […]
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజు వీఐసీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ తన భార్య, కూతురితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రోహిత్ శర్మ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనానంతరం రోహిత్ శర్మ దంపతులకు రంగనాయక మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు రోహిత్ శర్మను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇక స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వచ్చిన రోహిత్ శర్మను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే రోహిత్ శర్మ తిరుమలకు నాలుగేండ్ల తర్వాత వచ్చారు. 2019లో వరల్డ్ కప్‌కు ముందు కూడా రోహిత్ శ్రీవారిని దర్శించుకున్నారు. నాడు ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో రోహిత్ శతకాల మోత మోగించారు. ఐదు సెంచరీలు కొట్టారు. ఇక ఆగస్టు 30 నుంచి ఆసియా కప్, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ జరగనున్నాయి. ఈ రెండింటిలో రోహిత్ మరోసారి పరుగుల మోత మోగించనున్నారు. మరోసారి స్వామి వారి ఆశీర్వాదంతో సెంచరీలు కొట్టడం ఖాయమని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Rohit Sharma & his family visited Tirupathi Balaji Temple.pic.twitter.com/2HRFACIzdJ
— Johns. (@CricCrazyJohns) August 13, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram