Site icon vidhaatha

అద్దె కట్టేందుకు వెళితే.. ఇంకేదో అడిగాడు..! నటి తేజస్విని కామెంట్స్‌

Tejaswini Pandit | చిత్రసీమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే పలువురు నటీమణులు తమకు ఇండ్రస్ట్రీలో జరిగిన చేదు అనుభవాలను బయటపెట్టారు. అయితే క్యాస్టింగ్‌ కౌచ్‌ కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదని, మిగతా రంగాల్లోనూ ఈ జాడ్యం కనిపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మరాఠా నటి తేజస్విని పండిట్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. హీరోయిన్లకు సినిమా వాళ్ల నుంచే కాకుండా బయటితోనూ చేదు అనుభవాలు ఎదురవుతాయని చెప్పింది. ఓ ఇంట్వర్వ్యూలో పాల్గొన్న తేజస్విని తన కెరీర్‌ తొలి నాళ్లలో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నది.

2009-10 ప్రాంతంలో పుణెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ‘అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. ఆ అపార్ట్‌మెంట్‌ ఓ కార్పొరేటర్‌కు చెందింది. అద్దె చెల్లించేందుకు ఓ సారి అతని కార్యాలయానికి వెళితే.. ఫేవర్‌ చేయమని అడిగాడు. అద్దెకు బదులుగా ఇంకేదో అడిగాడు. అలా అనగానే అక్కడ టేబుల్‌పై నీటితో ఉన్న గ్లాసును తీసుకొని అతని ముఖంపై విసిరాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి రాలేనని, అలా చేసివుంటే అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉండాల్సిన అవసరం రాదంటూ బుద్ధి చెప్పినట్లు పేర్కొంది. ప్రస్తుతం తేజస్వి ఓ వెబ్‌సిరిస్‌లో నటిస్తున్నది.

Exit mobile version