Telangana | పాఠశాలలకు 13రోజులు సెలవులు.. దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల వెల్లడి
విధాత: తెలంగాణ ప్రభుత్వం పండుగల సందర్భంగా పాఠశాలలకు 13రోజుల సెలవులు ప్రకటించింది. ఆక్టోబర్ 13నుంచి 25వరకు 13రోజుల దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా క్రిస్మస్, సంక్రాంతి సెలవులను కూడా ప్రకటించింది.
డిసెంబర్ 22నుంచి 26వరకు ఐదు రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని తెలిపింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో కలిపి ఆరు రోజుల సెలవులను ప్రకటించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram