CM KCR | విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్.. దేశంలో మార్మోగుతున్న తెలంగాణ మోడ‌ల్ : సీఎం కేసీఆర్

CM KCR | హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా రూపుదిద్దుకుంటుంద‌ని, దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడ‌ల్ మార్మోగుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వం సంద‌ర్భంగా నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా.. ఇక్కడ అన్ని రాష్ట్రాలు,అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలసిమెలసి బతుకుతున్నారని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా […]

  • By: raj    latest    Sep 17, 2023 7:46 AM IST
CM KCR | విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్.. దేశంలో మార్మోగుతున్న తెలంగాణ మోడ‌ల్ : సీఎం కేసీఆర్

CM KCR | హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా రూపుదిద్దుకుంటుంద‌ని, దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడ‌ల్ మార్మోగుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వం సంద‌ర్భంగా నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా.. ఇక్కడ అన్ని రాష్ట్రాలు,అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలసిమెలసి బతుకుతున్నారని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం. గతంలోలాగా మత కల్లోలాలు,గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది అని సీఎం తెలిపారు.

క్యూ క‌డుతున్న అంత‌ర్జాతీయ కంపెనీలు..

పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్ వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ. 67 వేల కోట్లకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నాం. ఈ ఎస్సార్డీపీ పనులతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయస్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం న‌లువైపులా రూ. 69 వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. దీంతో హైద‌రాబాద్ విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నదని సీఎం తెలిపారు.

స్వ‌ర్ణ‌యుగాన్ని త‌ల‌పిస్తున్న తెలంగాణ సాగునీటి రంగం

కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, మిషన్ కాకతీయ,పెండింగ్ ప్రాజెక్టులనిర్మాణం,ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు, రైతుబీమా, రూ. 37వేల కోట్ల వరకూ పంటరుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయి. వ్యవసాయం పండుగగామారింది. సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పూర్తిగా నిమగ్నమై ఉంది.

అన్నింటా నంబర్ వన్ తెలంగాణ

నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ఇవాళ మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన,సురక్షితమైన తాగునీరుని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాల‌కు అడ్డుప‌డే ప్ర‌గ‌తి నిరోధ‌క శ‌క్తుల‌కు ప‌రాజ‌య‌మే..

దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్నవయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మున్ముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదు. మన సమైక్యతేమనకు బలం. ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారుతెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.