Telangana Forest | తెలంగాణ అడవుల్లో.. 26 పులులు, భారీగా నల్ల చిరుతలు
Telangana Forest | యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దరఖాస్తుకు సమాధానం విధాత: తెలంగాణ ఫారెస్టుశాఖ అడవిలో జంతువుల పరిరక్షణ కోసం ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. జంతువుల తాగునీరు, జంతువుల రక్షణ కోసం ఎన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారు పూర్తి సమాచారం ఇవ్వాలని యూత్ పర్ యాంటీ కరప్షన్ తెలంగాణ అటవీ శాఖను సమాచారహక్కు చట్టం ద్వారా ప్రశ్నించింది. అందుకు తెలంగాణ పిఐఓ సంహిత సమాచారం అందించారు. తెలంగాణ అటవీ […]
Telangana Forest |
- యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దరఖాస్తుకు సమాధానం
విధాత: తెలంగాణ ఫారెస్టుశాఖ అడవిలో జంతువుల పరిరక్షణ కోసం ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. జంతువుల తాగునీరు, జంతువుల రక్షణ కోసం ఎన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.
వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారు పూర్తి సమాచారం ఇవ్వాలని యూత్ పర్ యాంటీ కరప్షన్ తెలంగాణ అటవీ శాఖను సమాచారహక్కు చట్టం ద్వారా ప్రశ్నించింది. అందుకు తెలంగాణ పిఐఓ సంహిత సమాచారం అందించారు.
తెలంగాణ అటవీ ప్రాంతంలో పులులు, నల్ల చిరుతల పరిరక్షణ కోసం ఫారెస్ట్ శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. వాటి తాగునీటి కోసం తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 3289 తాగునీటి గుంతలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాని నీటి గుంతలకు సంబంధించిన బడ్జెట్ మాత్రం అందించలేదు. జంతువుల పర్యవేక్షణ కోసం ఎన్నిసిసి కెమెరాలు ఉన్నాయని అడగగా, వాటి సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని, జిల్లాల వారీగా ఫారెస్ట్ అధికారులను అడిగి సమాచారం తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణ అటవీ ప్రాంతంలో 2028 ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్టు ప్రకారం 26 పులులు ఉన్నాయని తెలిపింది. వాటితో పాటు 334 నల్ల చిరుతలు ఉన్నాయని సమాచారం అటవీశాఖ సమాచారం ఇచ్చిందని సంస్థ పౌండర్ రాజేంద్ర తెలిపారు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram