Anganwadi Teachers | తెలంగాణ‌లో 14 వేల అంగ‌న్‌వాడీ టీచర్ పోస్టుల భ‌ర్తీ.. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్! అర్హ‌త‌లు ఇవే

  • By: sr    latest    Feb 22, 2025 5:23 PM IST
Anganwadi Teachers | తెలంగాణ‌లో 14 వేల అంగ‌న్‌వాడీ టీచర్ పోస్టుల భ‌ర్తీ.. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్! అర్హ‌త‌లు ఇవే

Anganwadi Teachers | రాష్ట్రంలోని నిరుద్యోగ మ‌హిళ‌ల‌కు( Womens ) శుభ‌వార్త‌. నిరుద్యోగ మ‌హిళ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి( CM revanth Reddy ) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ వ్యాఫ్తంగా ఖాళీగా ఉన్న అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల( Anganwadi Teachers ) పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు కాంగ్రెస్ స‌ర్కార్( Congress Govt ) సిద్ధ‌మైంది. దీంతో పెద్ద ఎత్తున మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు ద‌క్క‌నున్నాయి.

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 14,236 అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల ఖాళీల భ‌ర్తీకి ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. 6,399 అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 7,837 హెల్ప‌ర్ల భ‌ర్తీకి రంగం సిద్ధ‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే నోటిఫికేష‌న్ జారీకి సిద్ధం. జిల్లాల వారీగా నోటిఫికేష‌న్లు జారీ చేయ‌నున్నారు. ఈ స్థాయిలో జాబ్ నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో తొలిసారి అని సంబంధిత శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఉండాల్సిన అర్హతలు ఇవే..

  • అంగన్‌వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యే వారు కనీసం 10వతరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • జనరల్‌, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 21 నుంచి 35 ఏళ్లు.. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 18- 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అలాగే.. స్థానిక స్థిర నివాసం కలిగి వివాహిత మహిళలై ఉండాలి.
  • జీత భత్యాలు: అంగన్‌వాడీ టీచర్‌కు రూ.12,500-రూ.13,500. హెల్పర్‌కు రూ.8,000 ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువ పత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.