Telangana Liberation Day | రాష్ట్రపతి భవన్‌లో విమోచన దినోత్సవ వేడుకలు
Telangana Liberation Day | ట్విట్ చేసిన బీజేపీ విధాత, హైదరాబాద్: ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై ఫోటోలతో ఉన్న పోస్టర్‌ను బీజేపీ తెలంగాణ ట్విట్ చేసింది. ఇందులో 15 సెప్టెంబర్-17 సెప్టెంబర్2023 అని ఉంది. ఢిల్లీ రాష్ట్రపతి […]

Telangana Liberation Day |
- ట్విట్ చేసిన బీజేపీ
విధాత, హైదరాబాద్: ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై ఫోటోలతో ఉన్న పోస్టర్‌ను బీజేపీ తెలంగాణ ట్విట్ చేసింది. ఇందులో 15 సెప్టెంబర్-17 సెప్టెంబర్2023 అని ఉంది.
ఢిల్లీ రాష్ట్రపతి భవన్ , సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం.#TelanganaLiberationDay pic.twitter.com/uQ72wUdEcU
— BJP Telangana (@BJP4Telangana) September 15, 2023
కార్యక్రమంలో సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో విమోచన వేడుకలు అని తెలిపారు. దీంతో ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో అని పెద్ద హెడ్డింగ్ పెట్టి, వివరాల్లో సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో అని తెలుపడం పట్ల నెటజన్లు ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఔరా ఇదేమి వింత అని అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో చేసే కార్యక్రమాలకు ఢిల్లీలో అని పోస్టర్ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని విమర్శిస్తున్నారు