kidnapping | తెలంగాణ పోలీస్ సూపర్.. కిడ్నాప్ క‌థ సుఖాంతం

kidnapping కిడ్నాప్‌కు గురైన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన రాచకొండ పోలీసులు విధాత: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలిక కథ సుఖాంతమైంది. తెలంగాణ పోలీసులు కిడ్నాప్ కు గురైన బాలికను రక్షించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఘట్కేసర్ లో కిడ్నాప్ కి గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని రాచకొండ పోలీసులు క్షేమంగా పాప తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్వయంగా ఎత్తుకునివచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. బాధిత చిన్నారి […]

kidnapping | తెలంగాణ పోలీస్ సూపర్.. కిడ్నాప్ క‌థ సుఖాంతం

kidnapping

  • కిడ్నాప్‌కు గురైన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన రాచకొండ పోలీసులు

విధాత: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలిక కథ సుఖాంతమైంది. తెలంగాణ పోలీసులు కిడ్నాప్ కు గురైన బాలికను రక్షించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఘట్కేసర్ లో కిడ్నాప్ కి గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని రాచకొండ పోలీసులు క్షేమంగా పాప తల్లిదండ్రులకు అప్పగించారు.

పాపను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్వయంగా ఎత్తుకునివచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. బాధిత చిన్నారి ఇంటి దగ్గరలో నివసించే వ్యక్తి సురేష్, నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో చాక్లెట్ కోసం బయటికి వచ్చిన పాపను అపహరించడం జరిగింది.

ఫిర్యాదు అందుకున్న ఘట్కేసర్ పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం చిన్నారిని రక్షించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దీంతో తెలంగాణ పోలీసుల సత్వర స్పందనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.