Sreeleela: శ్రీలీల.. ఇంతలా షాకిచ్చిందేంటి!

  • By: sr    latest    Feb 15, 2025 7:51 PM IST
Sreeleela: శ్రీలీల.. ఇంతలా షాకిచ్చిందేంటి!

విధాత‌:  ఇటీవ‌ల డ్యాన్సింగ్ క్వీన్‌, టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల (Sreeleela) టాలీవుడ్‌ను వ‌దిలి బ‌య‌టి భాషా చిత్రాల‌పై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే త‌మిళంలో శివ కార్తికేయ‌న్‌తో ప‌రాశ‌క్తి అనే మూవీ చేస్తున్న ఈ ముత్తుగుమ్మ బాలీవుడ్‌లో రెండు చిత్రాల‌కు సైతం సైన్ చేసింది. అందులో ఒక‌టి సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రంతో పాటు కార్తిక్ ఆర్య‌న్ (Kartik Aaryan)తో ఓ రొమాంటిక్‌ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఈ నేథ్యంలో తాజాగా శ‌నివారం స‌ద‌రు సినిమా నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఆ టీజ‌ర్‌లో శ్రీలీల (Sreeleela) కాస్త గ్లామ‌ర‌స్‌గా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను షాక్ గురి చేసింది. ఈ మూవీకి ప్ర‌ఖ్యాత డైరెక్ట‌ర్ అనురాగ్ బ‌సు (Anurag Basu) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ప్రీతం (Pritam) సంగీతం అందిస్తున్నాడు. ఈ దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి రానుంది.

అయితే ఈ సినిమా శ్రీలీల‌కు బాలీవుడ్ ఎంట్రీ చిత్రం అవ‌నుంది. అంతేకాదు గ‌తంలో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఆషికీ సినిమాల‌కు సీక్వెల్ అనే ప్ర‌చారంలో ఉంది. చూడాలి శ్రీలీల (Sreeleela) బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు అల‌రించ‌నుందో.

ఇదిలాఉండ‌గా ఈ సంవ‌త్స‌రం అంతా శ్రీలీల హాడావుడి ఉండ‌నుంది. తెలుగులో నితిన్‌తో న‌టించిన రాబిన్ హుడ్‌తో మొద‌లుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, ర‌వితేజ మాస్ జాత‌ర‌, శివ కార్తికేయ‌న్ ప‌రాశ‌క్తి, క‌న్న‌డ‌లో రెండు సినిమాలు ఇలా అర డ‌జ‌న్‌కు పైగానే చిత్రాలు ఈ యేడు ప్రేక్ష‌కుల‌కు ముందుకు రానున్నాయి.