Terror Fever: దేశంలో టెర్రర్ ఫీవర్..నిఘా సంస్థల వార్నింగ్ !
దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు (Intelligence sources) హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి.

Terror Fever:: దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు (Intelligence sources) హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వే, ఏయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశాలిచ్చారు. ఉగ్రదాడులపై కేంద్రం సముద్ర తీర రాష్ట్రాలను, పట్టణాలను అప్రమత్తం చేసింది. సముద్ర తీర మార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని నిఘా సంస్ధలు హెచ్చరించాయి. కాగా ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో కేంద్ర నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం.
ముంబై దాడులకు సముద్ర మార్గంలోనే చొరబాటు
2008 నవంబర్ 26న 10మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబయికి చేరుకొని.. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, 260మంది వరకు గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణాను తాజాగా ఐఎన్ఏ అమెరికా నుంచి భారత్ కు తీసుకవచ్చి విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.