సైబర్ అలర్ట్..బీ కేర్ ఫుల్
అనంతపురం:క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డు తీసుకున్నారా , మీ యొక్క KYC వెరిఫికేషన్ కోసం బ్యాంకు నుండీ ఫోన్ చేస్తున్నాం అంటూ కాల్స్ వచ్చాయా … అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు క్రెడిట్ / డెబిట్ కార్డు KYC అప్ డేటింగ్ కోసం లేదా వెరిఫికేషన్ కోసం అంటూ ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు .ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు నూతనంగా క్రెడిట్ / […]

అనంతపురం:క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డు తీసుకున్నారా , మీ యొక్క KYC వెరిఫికేషన్ కోసం బ్యాంకు నుండీ ఫోన్ చేస్తున్నాం అంటూ కాల్స్ వచ్చాయా … అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త!
సైబర్ నేరగాళ్లు క్రెడిట్ / డెబిట్ కార్డు KYC అప్ డేటింగ్ కోసం లేదా వెరిఫికేషన్ కోసం అంటూ ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు .ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు నూతనంగా క్రెడిట్ / డెబిట్ కార్డ్ తీసుకున్న వారిని టార్గెట్ గా ఎంచుకొని మోసాలకు ఒడిగడుతున్నారు .ఈ నేరాలలో సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుండి చేస్తున్నాం అని చెప్పి , మీరు ఇటీవలే క్రెడిట్/ డెబిట్ కార్డ్ తీసుకున్నారు కదా… ఈ విషయం పై మీ KYC వివరాలను అప్‌డేట్ చేస్తాం అని లేదా వెరిఫికేషన్ నిమిత్తం ఫోన్ చేశాం అని నమ్మిస్తారు. మీరు సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలను నమ్మి మీ కార్డ్ వివరాలు తెలియ చెప్పగా వెంటనే మీ ఖాతా నుండి డబ్బును కాజేస్తారు.
ఇలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:మీకు ఈ విధంగా ఎవరైనా ఫోన్ చేసినట్లయితే వారిని నమ్మకండి .మీ ఖాతా వివరాలను మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు తెలియచేయకండి .బ్యాంక్ వారు ఎప్పుడు మీ యొక్క కార్డు వివరాలను కానీ, వ్యక్తిగత సమాచారాన్ని కానీ అడగరు .సైబర్ నేరాలు లేదా సైబర్ సమస్యలు తలెత్తినప్పుడు స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని… సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100 గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS విజ్ఞప్తి చేశారు.