Thalapathy Vijay | విజయ్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌..! మూడేళ్లు సినిమాలకు దూరం..!!

Thalapathy Vijay | దళపతి విజయ్ అభిమానులకు నిజంగా ఇది షాకింగ్‌ న్యూసే. దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విజయ్‌.. వాటిపై పూర్తి స్థాయి దృష్టి సారించేందుకే సినిమాలకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విజయ్‌ పూర్తిగానే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయబోడని తాజాగా […]

Thalapathy Vijay | విజయ్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌..! మూడేళ్లు సినిమాలకు దూరం..!!

Thalapathy Vijay | దళపతి విజయ్ అభిమానులకు నిజంగా ఇది షాకింగ్‌ న్యూసే. దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విజయ్‌.. వాటిపై పూర్తి స్థాయి దృష్టి సారించేందుకే సినిమాలకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విజయ్‌ పూర్తిగానే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయబోడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వెంకట్‌ ప్రభుతో కలిసి విజయ్‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు బ్రేక్‌ తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మూడేళ్లలో తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలున్నాయి. రజనీకాంత్‌ తర్వాత తమిళనాట విజయ్‌కు క్రేజ్‌ భారీగా ఉన్నది. పెద్ద ఎత్తున ఉన్న అభిమానులు ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

పెద్ద ఎత్తున ఉన్న అభిమానులు కార్యకర్తలుగా చేరే అవకాశాలున్నాయి. అయితే, విజయ్‌ పార్టీని ప్రకటిస్తాడా? లేదంటే ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ఎందులోనైనా చేరుతాడా? అనే క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశాలున్నాయి. దాదాపు మూడు సంవత్సరాల పాటు విజయ్‌ సినిమాలకు దూరంకానుండడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇటీవల విజయ్‌ ‘వారిసు’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘లియో’లో నటిస్తున్నాడు. చిత్రంలోని విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తున్నది.