Site icon vidhaatha

Titan | టైటానిక్ కూలిన స్థలంలోనే.. టైటాన్ పేలిపోయింది: నిర్ధారించిన కోస్ట్‌గార్డ్‌

విధాత‌: ఉత్తర అట్లాంటిక్‌లోని శీతల జలాల్లో టైటానిక్ శిథిలాలను చూసేందుకు దాదాపు 3,800 మీటర్ల లోతు వరకు ఒక పైలట్ మరియు నలుగురు సిబ్బందిని తీసుకువెళుతున్న ‘టైటాన్స‌ (Titan) అనే 6.7 మీటర్ల పొడవైన సబ్‌మెర్సిబుల్‌తో పేలిపోయిన‌ట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ స్ప‌ష్టం చేసింది.

జూన్ 22న టైటానిక్ సమీపంలో సబ్‌మెర్సిబుల్ ‘శిథిలాల’ భాగాలు క‌నిపెట్టిన‌ట్లు ధ్రువీకరించింది. అందులో ఉన్న వారంతా చనిపోయార‌ని కూడా నిర్ధార‌ణ చేసింది. టైటాన్ చివ‌ర‌గా మ్యాప్‌లో క‌నిపించిన ప్రదేశం సమీపంలో పేలుడుకు సంబంధించిన సాక్ష్యాలు ల‌భించిన‌ట్లు అమెరికా నావికా దళం కూడా ధ్రువీకరించింది.

ఈ టైటాన్ పేలుడులో బిలియనీర్ హమీష్ హార్డింగ్, వ్యాపారవేత్త షాజాదా దావూద్ అత‌ని కుమారుడు సులేమాన్ దావూద్, టైటానిక్ పరిశోధకుడు పాల్-హెన్రీ నార్గోలెట్. సబ్‌మెర్సిబుల్‌ను పైలట్ చేసిన‌ టైటాన్ – ఓషన్‌గేట్ కంపెనీ CEO స్టాక్‌టన్ రష్ కూడా చ‌నిపోయారు. వీరు 2 ల‌క్ష‌ల 50 వేల డాల‌ర్లు ఖ‌ర్చు చేసి ఈ పర్యటనకు బ‌య‌లుదేరారు.

ఈ ప్ర‌మాదంపై యుఎస్ కోస్ట్ గార్డ్ కారణాలను పరిశోధించింది. కెనడియన్ అధికారులు కూడా ఈ ప్ర‌మాదంపై వారి సొంత దర్యాప్తును ప్ర‌క‌టించారు. టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ పేలుడుకు గల కారణాలను లోతుగా పరిశీలిస్తున్నట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ కూడా ఆదివారం తెలిపింది.

టైటానిక్ నుంచి 1,600 అడుగుల (488 మీటర్లు) దూరంలో సబ్‌మెర్సిబుల్ నుండి శిథిలాలు కనుగొన్న‌ట్లు ప్రకటించింది. “ఉత్తర అట్లాంటిక్‌లోని టైటానిక్ శిధిలాలను సందర్శించేందుకు వెళుతున్న సమయంలో పేలుడు జ‌రిగింది. ఈ ప్రమాదంలో అందులోని ఐదుగురు మరణించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కెనడా ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపిన ఒకరోజు తర్వాత యూఎస్ కోస్ట్‌గార్డ్ పూర్తి అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో పాటు ఫ్రెంచ్, బ్రిటిష్ అధికారులకు కూడా ద‌ర్యాప్తులో సహకరిస్తున్నట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.

Exit mobile version