G20 Summit | జీ 20 సదస్సు నేపథ్యంలో.. దిల్లీలో కుక్కల వేట. కనపడకుండా దాచాలని ఆదేశాలు
G20 Summit విధాత: త్వరలో దిల్లీ (Delhi) లో జరగనున్న జీ 20 సదస్సు ఆ నగరంలో వీధి కుక్కల (Street Dogs) మెడకు చుట్టుకుంది. వీటిని పట్టుకుని, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి, ఆ కుక్కలను కనపడకుండా దాచేందుకు అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు వీధి కుక్కలను గుర్తించి వాటిని పట్టుకోవాలని.. దిల్లీ మున్సిపాలిటీ అధికారులు.. ఉద్యోగులను ఆదేశించారు. ఈ నిర్ణయం క్రూరమైనదని, చట్టవ్యతిరేకమైనదని జంతు ప్రేమికుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉద్యోగులకు వచ్చిన ఆదేశాల […]
G20 Summit
విధాత: త్వరలో దిల్లీ (Delhi) లో జరగనున్న జీ 20 సదస్సు ఆ నగరంలో వీధి కుక్కల (Street Dogs) మెడకు చుట్టుకుంది. వీటిని పట్టుకుని, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి, ఆ కుక్కలను కనపడకుండా దాచేందుకు అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు వీధి కుక్కలను గుర్తించి వాటిని పట్టుకోవాలని.. దిల్లీ మున్సిపాలిటీ అధికారులు.. ఉద్యోగులను ఆదేశించారు. ఈ నిర్ణయం క్రూరమైనదని, చట్టవ్యతిరేకమైనదని జంతు ప్రేమికుల సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఉద్యోగులకు వచ్చిన ఆదేశాల ప్రకారం.. వలలను ఉపయోగించి వీధి కుక్కలను పట్టుకోనున్నారు. ముఖ్యంగా బొటీక్‌లు, ఎర్రకోట వంటి ప్రదేశాలు, లగ్జరీ హోటళ్ల వంటి 12కి పైగా ప్రదేశాల్లో ఈ పట్టివేతలు ఉంటాయి. ‘ఇప్పుడు పట్టుకుంటున్న కుక్కలను బాగా సంరక్షించాలి. జీ 20 కార్యక్రమం ముగిసేవరకు వాటి ఆహార బాధ్యతను మనమే నిర్వర్తించాలి’ అని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. 2012 జనాభా లెక్కల ప్రకారం.. దిల్లీలో సుమారు 60 వేల వీధి కుక్కలు నివాసం ఉంటున్నాయి.
ఎప్పటికప్పుడు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేస్తున్నప్పటికీ.. అవి ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు వలల ద్వారా సిబ్బంది కుక్కలను పట్టుకుంటే.. ఆ తర్వాత ఇవి మనుషుల మీద రక్షణాత్మక ధోరణితో దాడులకు పాల్పడే ప్రమాదం ఉంటుందని జంతు నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వీధి కుక్కల్లో చాలా వాటిని దిల్లీ నగర వాసులు బాధ్యతతో చూసుకుంటారని.. వాటి వల్ల సదస్సుకు ఏ ప్రమాదమూ ఉండదని పెటా సభ్యుడు అషర్ పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram