Gadwal | వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం.. కుట్లు వేయ‌కుండా ఫెవికిక్‌తో అతికించారు..

Gadwal | ఓ అబ్బాయి కంటిపై భాగంలో తీవ్ర గాయ‌మైంది. దీంతో అత‌న్ని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. అత‌నికి కుట్లు వేయకుండా, ఫెవికిక్ అతికించి పంపారు. ఈ ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని అయిజ‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క రాయిచూరు జిల్లా లింగ‌సూగూరుకు చెందిన వంశీకృష్ణ‌, సునీత అనే దంప‌తులు త‌మ బంధువుల పెళ్లి నిమిత్తం అయిజ‌కు వ‌చ్చారు. ఈ దంప‌తుల కుమారుడు ప్ర‌వీణ్ చౌద‌రి(7) ఆడుకుంటూ […]

Gadwal | వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం.. కుట్లు వేయ‌కుండా ఫెవికిక్‌తో అతికించారు..

Gadwal | ఓ అబ్బాయి కంటిపై భాగంలో తీవ్ర గాయ‌మైంది. దీంతో అత‌న్ని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. అత‌నికి కుట్లు వేయకుండా, ఫెవికిక్ అతికించి పంపారు. ఈ ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని అయిజ‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క రాయిచూరు జిల్లా లింగ‌సూగూరుకు చెందిన వంశీకృష్ణ‌, సునీత అనే దంప‌తులు త‌మ బంధువుల పెళ్లి నిమిత్తం అయిజ‌కు వ‌చ్చారు. ఈ దంప‌తుల కుమారుడు ప్ర‌వీణ్ చౌద‌రి(7) ఆడుకుంటూ కింద‌ప‌డ్డాడు. దీంతో ఎడ‌మ కంటిపై భాగంలో తీవ్ర గాయ‌మైంది.

హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లోతైన గాయానికి ఎలాంటి కుట్లు వేయ‌కుండా, ఫెవికిక్‌తో అతికించారు. వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యాన్ని గ‌మ‌నించిన తండ్రి వంశీకృష్ణ‌.. ఆ ఆస్ప‌త్రి వైద్యుడిని నిల‌దీశాడు. సిబ్బంది పొర‌పాటు చేసి ఉండొచ్చ‌ని, బాలుడికి ఏం కాద‌ని డాక్ట‌ర్ నాగార్జున చెప్పాడు. ఏదైనా జ‌రిగితే తానే బాధ్య‌త వ‌హిస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఈ ఘ‌ట‌న‌పై వంశీకృష్ణ అయిజ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారం అయిజ ప‌ట్ట‌ణంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.