Police | ఎన్నికలకు పోలీసు శాఖ సన్నద్ధం
Police | సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల పోలీసులతో ప్రత్యేక సమన్వయ సమావేశాలు మద్యం, డబ్బు అక్రమ రవాణా.. మావోయిస్టుల కదలికలపై నిఘా విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఓటరు జాబితా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది . ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, శాంతిభద్రతలపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. […]

Police |
- సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల పోలీసులతో ప్రత్యేక సమన్వయ సమావేశాలు
- మద్యం, డబ్బు అక్రమ రవాణా.. మావోయిస్టుల కదలికలపై నిఘా
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఓటరు జాబితా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది . ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, శాంతిభద్రతలపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు.
అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీ వీరన్న, డీఎస్పీలు, ఇతర పోలీసులు అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. జిల్లాల పోలీస్ అధికారుల మధ్య సంబంధం మరింత మెరుగుపడేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు, మార్గదర్శకాల గురించి సూచనలు, సలహాలు అందజేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర పోలీసు అధికారులతో ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అతిథి గృహంలో జైపూర్ సబ్ డివిజన్ పోలీసులు, సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని సిర్వంచ పోలీసు అధికారులతో కలిసి సమావేశమయ్యారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు అంశాలపై చర్చించారు.
మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు అక్రమ రవాణా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. సరిహద్దులోని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్భందీగా తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని తీర్మానించారు. ఈ సమావేశంలో జైపూర్ ఏసీపీ మోహన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సిర్వంచ డీఎస్పీ సుహాస్ షిండే, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.