Chevella | కేటీఆర్ Vs రేవంత్.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై పరస్పర విసుర్లు

Chevella | కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌పై పరస్పర విసుర్లు డిక్లరేషన్ సభ కాదు.. ఫ్రస్టేషన్ సభ అన్న కేటీఆర్‌ డజన్ హామీలు గాలిలో దీపాలంటూ సెటైర్‌ కౌంటర్ ఎటాక్ చేసిన రేవంత్‌రెడ్డి మా డిక్లరేషన్ దళిత సీఎం చేస్తానని మోసగించడం కాదు ఎస్సీ, ఎస్టీల్లో గుణాత్మక మార్పు తేనుందంటూ స్పష్టీకరణ కేసీఆర్ ఖేల్ ఖతం..బీఆరెస్ దుకాణ బంద్ అంటూ నినాదం విధాత : కాంగ్రెస్ చేవెళ్ల ప్రజాగర్జన సభలో చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై […]

  • Publish Date - August 28, 2023 / 11:45 AM IST

Chevella |

  • కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌పై పరస్పర విసుర్లు
  • డిక్లరేషన్ సభ కాదు.. ఫ్రస్టేషన్ సభ అన్న కేటీఆర్‌
  • డజన్ హామీలు గాలిలో దీపాలంటూ సెటైర్‌
  • కౌంటర్ ఎటాక్ చేసిన రేవంత్‌రెడ్డి
  • మా డిక్లరేషన్ దళిత సీఎం చేస్తానని మోసగించడం కాదు
  • ఎస్సీ, ఎస్టీల్లో గుణాత్మక మార్పు తేనుందంటూ స్పష్టీకరణ
  • కేసీఆర్ ఖేల్ ఖతం..బీఆరెస్ దుకాణ బంద్ అంటూ నినాదం

విధాత : కాంగ్రెస్ చేవెళ్ల ప్రజాగర్జన సభలో చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్‌, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్ రంజుగా సాగింది. కేటీఆర్ తన ట్వీట్‌లో కాంగ్రెస్ ది ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ కాదని…అధికారం రానే రాదనే కాంగ్రెస్ ఫ్రస్టషన్ సభ అంటూ సైటర్లు వేశారు.

కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మెదెవరని, గాడ్సేనే(రేవంత్‌) గెలుస్తాడన్న గ్యారెంటీ లేదని, మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడదని, చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసని, మీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజన్ హామీలు గాలిలో దీపాలేనంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

స్వాతంత్రం వచ్చిన 75ఏళ్ల తర్వాతా కూడా ఎస్సీ, ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే అందుకు ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకపడ్డారు. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్ధాల పాపమే ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతునే ఉంటుందన్నారు.

కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదని, ప్రజల్లో క్రెడిబిలిటీ లేదన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవర్చని పార్టీ కాంగ్రెస్ అయితే, ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆరెస్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదని, కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదన్నారు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆరెస్ పార్టీ మాత్రమే నంటూ ట్వీట్టర్‌లో చెప్పుకొచ్చారు.

ఘాటుగా రేవంత్ కౌంటర్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ఆ వర్గాల ప్రజల్లో గుణాత్మక మార్పునకు ఉద్ధేశించిందని, దళితుడిని సీఎం చేస్తానని మోసగించం వంటి కాదంటూ తమ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్టర్ వేదిగానే కౌంటర్‌ ఇచ్చారు. మా కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ మీలాగా ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి స్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు. మా డిక్లరేషన్‌ గిరిజనులకు 12శాతం రిజర్వేషభ్లు పెంచుతామంటూ మోసం చేయడం లాంటిది కాదంటూ చురకలేశారు.

మద్దతు ధర అడిగిన గిరిజన రైతులను బందీపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదన్నారు. నేరళ్ల ఇసుక దోపీడిని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదన్నారు. దళిత, గిరిజనులకు కాంగ్రెస్‌ హాయంలో ఇచ్చిన అసైన్డ్‌ భూములను లాక్కుని రియాల్‌ ఎస్టేట్‌ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదన్నారు. దళిత మహిళ మరియమ్మను లాకప్‌ డెత్‌ చేయించడం లాంటిది కాదన్నారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదన్నారు. దళిత బంధు పథకంలో 30శాతం కమిషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదన్నారు. అందుకే యావత్‌ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటనేనన్నారు. ఫైనల్‌గా కేసీఆర్‌ ఖేల్‌ ఖతం..బీఆరెస్‌ దుఖాన్ బంద్‌ అంటు తన ట్వీట్‌లో రేవంత్ నినాదమిచ్చారు.

Latest News