Kamareddy | నాడు రజాకార్లు.. నేడు బీఆర్ఎస్ రెండూ ఒకటే.. బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి

Kamareddy | విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: నాడు రజాకార్లను చూస్తే ప్రజలు భయపడేవారు.. నేడు బీఆర్ఎస్ నాయకులను చూసి భయపడుతున్నారు అని బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ తో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీని సైతం ఓడిస్తామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ […]

  • Publish Date - August 25, 2023 / 12:33 AM IST

Kamareddy |

విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: నాడు రజాకార్లను చూస్తే ప్రజలు భయపడేవారు.. నేడు బీఆర్ఎస్ నాయకులను చూసి భయపడుతున్నారు అని బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.

కామారెడ్డిలో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ తో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీని సైతం ఓడిస్తామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు వచ్చాయని, ఎక్కడా వెలమ కులాలు ఉన్నాయో వాళ్లకు పదవులు వచ్చాయన్నారు.

బీఆర్ఎస్ అంటే.. బైయింగ్, రూలింగ్, సేలింగ్ అని సీఎం కేసీఆర్ మార్చాడన్నారు. డబుల్ బెడ్ రూమ్, దళితులకు 3 ఎకరలా భూమి, ఉద్యోగాలు అని చెప్పి ఎలక్షన్ లో గెలిచి చివరికి ప్రజలను మోసం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేసే సమయంలో డబ్బులూ లేవన్నడు.. ఇప్పుడూ వేల కోట్లకు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు.

కేసీఅర్ గజ్వేల్ లో గెలిచి ఎమీ చేసిండో కామారెడ్డి ప్రజలు గమనించాలని కోరారు. మల్లన్న సాగర్ గ్రామ ప్రజలను కొట్టి బెదిరించి వారి భూములను లాక్కున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై నేనే పోటీ చేసి గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, కామారెడ్డిలో కాషాయం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Latest News